Rahul Gandhi : సిద్దూ కుటుంబానికి రాహుల్ భ‌రోసా

నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేత

Rahul Gandhi : దారుణ హ‌త్య‌కు గురైన సింగ‌ర్ సిద్దూ మూసే వాలా కుటుంబాన్ని సంద‌ర్శించారు కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ. సిద్దూ పేరెంట్స్ కు భ‌రోసా ఇచ్చారు. ఎలా జ‌రిగింద‌ని ఆరా తీశారు.

ఈ సంద‌ర్భంగా వారు ధైర్యంగా ఉండాల‌ని సూచించారు. పార్టీ అన్ని ర‌కాలుగా అండ‌గా ఉంటుంద‌ని, ఆదుకుంటుంద‌ని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi)  విదేశీ ప‌ర్య‌ట‌న ముగించుకుని ఇండియాకు వ‌చ్చిన వెంట‌నే సిద్దూ గ్రామానికి వ‌చ్చారు.

అగ్ర నేత ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మూసే వాలా గ్రామంలో భారీ ఎత్తున భ‌ద్ర‌త ఏర్పాట్లు చేశారు. కాగా మే 29న మాన్సా జిల్లాలో గుర్తు తెలియ‌ని దుండ‌గులు సిద్దూ మూసే వాలాను కాల్చి చంపారు.

ఏకంగా 32 రౌండ్ల పాటు కాల్పులు జ‌రిపారు. అంత‌కు ముందు పంజాబ్ లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సిద్దూ మూసే వాలా ఆనాటి పీసీసీ చీఫ్ న‌వ జ్యోత్ సింగ్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మాన్సా నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విజ‌య్ సింగ్లా చేతిలో ఓడి పోయారు. ఇదిలా ఉండ‌గా పంజాబ్ సీఎం రాష్ట్రంలో 424 మంది ప్ర‌ముఖుల‌కు సెక్యూరిటీ తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఆ మ‌రుస‌టి రోజే సింగ‌ర్ సిద్దూ మూసేవాలా దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. దీంతో ప్ర‌తిప‌క్ష పార్టీల‌తో పాటు సిద్దూ పేరెంట్స్ తీవ్రంగా మండిప‌డ్డారు.

ఇదే స‌మ‌యంలో ఎందుకు సెక్యూరిటీ తొల‌గించాల్సి వ‌చ్చిందో చెప్పాలంటూ పంజాబ్ , హ‌ర్యానా హైకోర్టు నోటీసులు జారీ చేసింది పంజాబ్ ప్ర‌భుత్వానికి. దీంతో తిరిగి సెక్యూరిటీ పున‌రుద్ద‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం.

Also Read : కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ షాకింగ్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!