Wayanad Landslides: వయనాడ్ ను ఆదుకోండి ! కేంద్రానికి రాహుల్ గాంధీ విజ్ఞప్తి !
వయనాడ్ ను ఆదుకోండి ! కేంద్రానికి రాహుల్ గాంధీ విజ్ఞప్తి !
Wayanad Landslides: కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి భారీగా ప్రాణనష్టం జరగడంతో కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని వయనాడ్ మాజీ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. ప్రకృతి వైపరీత్యంలో బాధితులకు తక్షణ పరిహారం విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. లోక్‌సభలో మంగళవారంనాడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, తరచు ప్రకృతి వైపరీత్యాలకు అతలాకుతలమయ్యే ప్రాంతాల పరిరక్షణకు కార్యాచరణ పథకాన్ని తక్షణం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
Wayanad Landslides in Kerala
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాట్లాడుతూ… ”ఈరోజు ఉదయం కొండచరియలు విరిగిపడటంతో వయనాడ్ అతలాకుతలమైంది. 45 మందికి పైగా ప్రాణాలు కోల్పాయారు. ముండక్కై ప్రాంతంతో సంబంధాలు తెగిపోయాయి. భారీగా జరిగిన ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని ఇంకా అంచనా వేయాల్సి ఉంది” అని రాహుల్ తెలిపారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో తాను మట్లాడినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం సహాయక చర్యలు, మెడికల్ కేర్ తో పాటు మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలని, అవసరమైతే పరిహారం పెంచాలని కోరారు. కీలకమైన కమ్యూనికేషన్, రవాణా లైన్స్‌ను పునరుద్ధరించాలని, సాధ్యమైనంత త్వరగా ఉపశమనం కలిగించాలని, బాధిత కుటుంబాల పునరావాసానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు.
దేశంలో కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలపై రాహుల్(Rahul GandhiRahul Gandhi) ఆందోళన వ్యక్తం చేస్తూ, వయనాడ్, వెస్ట్రన్ ఘాట్స్‌లోని పలు ప్రాంతాల్లో కొండచరియల ముప్పుపై పలు సార్లు తాను మాట్లాడానని, గత కొన్నేళ్లుగా దేశంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలు బాగా పెరిగాయని అన్నారు. ల్యాండ్‌స్లైడ్ ముప్పు ఉన్న ప్రాంతాలను గుర్తించి, ముప్పు నివారించే చర్యలు చేపట్టాలని, పర్యవారణపరంగా బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో తరచు జాతీయ విపత్తుల తీవ్రతను గుర్తించి వాటి నివారణకు తక్షణ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
కాగా, వయనాడు జిల్లా మెప్పాడిలో రెండు చోట్ల కొండ చరియలు విరిగిపడి వరద ప్రవాహం ఏరులై పారుతోంది. ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగా, మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. కోజికోడ్, మలప్పురం, కాసర్ గఢ్ జిల్లాలతోపాటు వయనాడుకు రెడ్ అలర్ట్ జారీచేసింది. పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పలక్కాడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేసింది. కొండచరియలు విరిగిపడటంతో వయనాడులో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఐదారు గ్రామాల్లో వరద నీరు పోటెత్తింది. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేసింది. చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. మహా వృక్షాలు కూడా నెలకొరిగాయి.
Also Read : Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం సాధించిన మను భాకర్