Rahul Gandhi : ఏంపీని నోరు మూసుకోమంటే ఎలా
నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
Rahul Gandhi BJP Mocks : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆయన మరోసారి కేంద్ర సర్కార్ ను టార్గెట్ చేశారు. తాను ప్రజాస్వామ్యం గురించి, భారత దేశం గురించి ఎక్కడా చులకనగా మాట్లాడ లేదని స్పష్టం చేశారు.
ప్రజలు ఎన్నుకున్నది ప్రశ్నించేందుకని నోరు మూసుకోమంటే ఎలా అని నిలదీశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi BJP Mocks). భారత దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని తాను అన్నట్లు , దానికి క్షమాపణలు చెప్పాలంటూ గత కొంత కాలంగా కేంద్రంలో కొలువు తీరిన బీజేపీకి చెందిన మంత్రులు, ఎంపీలు, సీఎంలు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
బహుషా దేశాన్ని సర్వ నాశనం చేయడమే కాకుండా ఉన్న వనరులను ఒకే ఒక్క వ్యాపారవేత్త అదానీకి దోచి పెడుతున్నా తాను ఎలా ప్రశ్నించకుండా ఉంటానని అన్నారు రాహుల్ గాంధీ.
ఇవాళ తన నోరు మూయించగలరు కానీ నిజాన్ని , వాస్తవాలను, మోసాలను మూసి ఉంచ లేరని స్పష్టం చేశారు. తాను దేశం బాగుండాలని కోరుకుంటున్న వ్యక్తినని పేర్కొన్నారు. వాళ్లకు ఎంత సేపు ఆరోపణలు చేయడం, ఆ తర్వాత వ్యక్తిగత విమర్శలకు దిగడం ఒక అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ.
దీని గురించి తాను ఎల్లప్పుడూ ప్రస్తావిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. తనపై నలుగురు ఎంపీలు పదే పదే ప్రశ్నలు సంధిస్తున్నారు. వాళ్లకు సమాధానం పార్లమెంట్ లోనే చెప్పాలని అనుకుంటున్నా. ఇందుకు స్పీకర్ పర్మిషన్ ఇస్తే చెప్పేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు కాంగ్రెస్ అగ్రనేత. తాను అన్నదాంట్లో తప్పేమీ లేదన్నారు. ఇవాళ జరుగుతున్న దానినే తాను ప్రస్తావించానని తెలిపారు.
Also Read : రాహుల్ కు ఢిల్లీ పోలీస్ నోటీస్