Rahul Gandhi : హైదరాబాద్ – ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన ప్రకటన చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. తమ ప్రభుత్వం రావడం ఖాయమని జోష్యం చెప్పారు . బీఆర్ఎస్ ఖతం అవుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
Rahul Gandhi Comments on KCR
కాంగ్రెస్ పార్టీ ఈ సందర్బంగా ఆరు గ్యారెంటీ హామీలను ఇస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో ఇళ్లు లేని వాళ్లకు రూ. 5,00,000 ఉచితంగా ఇస్తామన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రూ. 2,500 ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సులలో మహిళలందరికీ ఉచితంగా ప్రయాణం ఇస్తామని ప్రకటించారు.
అందరికీ 200 యూనిట్ల మేరకు ఉచితంగా విద్యుత్ ను ఇస్తామని వెల్లడించారు. యువ వికాసం కింద రూ. 5,00,000 యువకులందరికీ ఉచితంగా ఇస్తామన్నారు. ఏం చదువుకున్నా కోచింగ్ ఫీజు కింద ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకం కింద రూ. 4000 వేల పెన్షన్ ఇస్తామన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద రూ. 10,00,000 వర్తింప చేస్తామన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ. 15,000 ఇస్తామన్నారు. రైతు కూలీలకు రూ. 12,000 ఇస్తామని తెలిపారు రాహుల్ గాంధీ.
బీఆర్ఎస్, బీజేపీ , ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని సంచలన ఆరోపణలు చేశారు. సోనియా గాంధీ మాట ఇచ్చారని దానిని తప్పే ప్రసక్తి లేదని ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పవర్ లోకి వచ్చిన వెంటనే కేబినెట్ ప్రమాణం స్వీకారం చేసిన రోజే అమలు చేస్తామన్నారు.
Also Read : Mallikarjun Kharge : రైతన్నలకు కాంగ్రెస్ భరోసా