Rahul Gandhi : విద్వేష రాజకీయాలు ఇక చెల్లవు – రాహుల్
బీజేపీపై నిప్పులు చెరిగిన అగ్ర నాయకుడు
Rahul Gandhi : భారతీయ జనతా పార్టీ విద్వేష రాజకీయాలకు తెర తీసిందని, ఇంత కాలం మతం పేరుతో రాజకీయం చేస్తోందంటూ నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ. ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం నాటితో ముగియనుంది. ఇప్పటి వరకు యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ , రాజస్థాన్ లలో పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా దేశానికి చెందిన ప్రముఖులు రాహుల్ గాంధీతో(Rahul Gandhi) జత కట్టారు. ఆయనతో అడుగులో అడుగు వేశారు. సంఘీభావం ప్రకటించారు. చిన్నారుల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు కలిసి యాత్రలో పాల్గొనడం మరింత ఊపు తెచ్చేలా చేసింది. ఇప్పటికే అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఓ ఆక్సిజన్ లాగా పని చేసిందనడంలో సందేహం లేదు.
ఇప్పటికే 100 రోజులు పూర్తి చేసుకున్నారు రాహుల్ గాంధీ. ఆయన ఎక్కడికి వెళ్లినా బీజేపీని, దాని అనుబంధ సంస్థలు చేస్తున్న విద్వేషాలతో కూడిన రాజకీయాలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సైతం ఏకి పారేస్తున్నారు.
రాజస్థాన్ లో కొనసాగుతున్న యాత్రను పురస్కరించుకుని రాహుల్ గాంధీ(Rahul Gandhi) మీడియాతో మాట్లాడారు. ఎంత మంది వస్తున్నారనేది తమ లక్ష్యం కాదన్నారు. ఈ దేశానికి ద్వేషం వల్ల ఉపయోగం లేదని కానీ మనుషుల మధ్య ప్రేమ కావాలని అన్నారు. అయితే ఆయన ఎందు కోసం పాదయాత్ర చేపట్టారో ఎవరికీ అర్థం కావడం లేదంటూ బీజేపీ ఎద్దేవా చేసింది.
Also Read : ఖర్గే కామెంట్స్ పై బీజేపీ కన్నెర్ర