Rahul Gandhi : కాంగ్రెస్ హస్తం పేదలకు నేస్తం
ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ
Rahul Gandhi : కల్వకుర్తి – తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిన కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగి పోయారని అన్నారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ హస్తం పేదలకు నేస్తమన్నారు. నీళ్లు , నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ కేవలం ఒకే కుటుంబానికి పరిమితమై పోయిందని ఆరోపించారు.
Rahul Gandhi Comment on KCR Ruling
ఈ పదేళ్లలో ప్రజల నుంచి దోచు కోవడమే తప్ప చేసింది ఏమీ లేదన్నారు. ఇవాళ అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేసి తాను మాత్రం ఫామ్ హౌస్ కే పరిమితమై పోయాడని ఆరోపించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
తాము ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అబద్దాలతో అధికారంలో కొనసాగుతోందన్నారు. ప్రజలు ఇకనైనా విలువైన ఓటును ఆలోచించి వేయాలని పిలుపునిచ్చారు. లేక పోతే మరోసారి దోపిడీకి తెర తీసినట్లవుతుందని హెచ్చరించారు.
ఇవాళ జరగబోయే ఎన్నికలు ప్రజల తెలంగాణకు దొరల తెలంగాణాకు మధ్య జరుగుతుందన్న యుద్దంగా రాహుల్ గాంధీ అభివర్ణించారు.
Also Read : CM KCR Slams : అభివృద్దికి నమూనా తెలంగాణ