Rahul Gandhi : అడ్డుకోవడం అప్రజాస్వామికం
నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
Rahul Gandhi : మణిపూర్ లో నిరాశ్రయులైన వారిని, బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన కాన్వాయ్ ని వెళ్లకుండా నిలిపి వేశారు. దీంతో రోడ్డు పైకి వచ్చారు. నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. మణిపూర్ అన్నది ఈ దేశంలోనే ఉంది. వేరే దేశంలో లేదు. నేను దేశానికి వ్యతిరేకం కాదు. కానీ పాలసీలను వ్యతిరేకిస్తానంతే. తాను సత్యం వైపు మాత్రమే నిలబడతానని గతంలో చెప్పాను. ఇప్పుడు కూడా ఇదే చెబుతున్నా. నియంతలు మాత్రమే ఇలాంటి పనికిమాలిన చర్యలకు దిగుతారంటూ మండిపడ్డారు రాహుల్ గాంధీ.
తాను శాంతి, ప్రేమ సందేశంతో మణిపూర్ కు చేరుకున్నా. నన్ను ఆపాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రశ్నించారు. ఇప్పటి వరకు హీంస చోటు చేసుకుంది. అపారమైన ప్రాణ నష్టం , ఆస్థి నష్టం జరిగింది. అయినా మణిపూర్ లో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకని కంట్రోల్ చేయలేక పోయిందని ప్రశ్నించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
ఇప్పటి వరకు జాతుల మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలి వానగా మారింది. 100 మందికి పైగా చని పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. 60 వేల మంది నిరాశ్రయులుగా మారారు. 10 వేల మంది సైనికులు మోహరించినా ఇంకా అదుపులోకి రావడం లేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.
Also Read : India Ranks 127 : లింగ సమానత్వంలో ఇండియా పూర్