Rahul Gandhi : ఈ దేశానికి తాను రాజునని అనుకుంటున్నారు ప్రధాని మోదీ. కానీ ఆయనకు తెలియని ఏమిటంటే పవర్ అన్నది ఎల్లకాలం ఉండదని తెలుసు కోవాలని హితవు పలికారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ.
ఆయన పూర్తిగా పవర్ ఉందని అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అంతే కాదు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
తమ పార్టీ అన్ని వర్గాలను, ప్రజలను, సంస్కృతుల్ని, నాగరికతను గౌరవిస్తామని స్పష్టం చేశారు. కులాల పేరుతో, మతం పేరుతో విద్వేషాలను రెచ్చ గొడుతూ ఓట్లు దండుకునే కార్యక్రమం కొనసాగుతోందన్నారు.
యూపీ, మణిపూర్ రాష్ట్రాల ప్రజలు తమకు ఒకటేనని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi ). మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు.
బీజేపీ సిద్దాంతం ఒక్కటే. విభజించు పాలించు. మత కల్లోలాలు సృష్టించడం మనుషుల మధ్య విభేదాలు కలిగించేలా చేయడం వారి పార్టీ లక్ష్యమని సంచలన ఆరోపణలు చేశారు.
ఈ రాష్ట్రానికి బీజేపీ చేసింది ఏమీ లేదన్నారు. వాళ్లు నరనరాన ఆధిపత్య ధోరణితో ప్రదర్శిస్తారు. కానీ తాను ఇక్కడికి వస్తే మానవత్వంతో వస్తానని చెప్పారు రాహుల్ గాంధీ.
బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న తేడా ఇదేనని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ ఎక్కడికి వెళ్లినా వాగ్ధానాలు చేస్తారని, కానీ వాటి గురించి ఆ తర్వాత పట్టించు కోరని ఎద్దేవా చేశారు.
ఈ దేశంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగినా పట్టించు కోవడం లేదన్నారు.
Also Read : వాళ్లే పొట్టన పెట్టుకున్నారు