Rahul Gandhi: వైఎస్‌ షర్మిలపై సోషల్ మీడియాలో జరుగుతున్న దాడిని ఖండించిన రాహుల్‌ గాంధీ !

వైఎస్‌ షర్మిలపై సోషల్ మీడియాలో జరుగుతున్న దాడిని ఖండించిన రాహుల్‌ గాంధీ !

Rahul Gandhi: ఏపీపీసీసీ చీఫ్ వైఎస్‌ షర్మిలపై సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న దాడిని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఖండించారు. ఈ మేరకు వైఎస్ షర్మిలతో పాటు సునీతపై దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని… వారికి ఎల్లవేళలా మద్దత్తుగా తాను, కాంగ్రెస్ పార్టీ ఉంటుందంటూ తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ (ట్విటర్) ద్వారా వెల్లడించారు. రాహుల్ గాంధీ ఎక్స్ లో పోస్ట్ చేసిన ట్వీట్ లో ఏముందంటే…. “మహిళలను అవమానించడం, వారిపై దాడి చేయడం పిరికిపంద చర్య. దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో శక్తిహీనులకు ఇది ఒక ఆయుధంగా మారిపోయింది.

వైఎస్ షర్మిల, సునీతపై జరిగిన ఈ అవమానకర దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది… వారికి అండగా ఉంటుందని ట్వీట్ లో రాహుల్(Rahul Gandhi) పేర్కొన్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ను షేర్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు… తాము కూడా షర్మిలకు అండగా ఉంటామంటూ కామెంట్లు పెడుతున్నారు.

Rahul Gandhi Comment

ఏపీపీసీసీ చీఫ్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి వైఎస్ షర్మిల రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేపట్టిన షర్మిల… తనదైన శైలిలో కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రం అధికారంలో ఉన్న వైసీపీలపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. ఈ నేపథ్యంలో సాక్ష్యాత్తూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన షర్మిల… వైసీపీపై చేస్తున్న విమర్శలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాయి. దీనితో వైఎస్ షర్మిలపై… వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున దాడికి పాల్పడుతున్నారు.

షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ అవినీతి, అక్రమాలతో పాటు వ్యక్తిగత విషయాలపై కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల వారికి ధీటుగా సమాధానం ఇస్తున్నప్పటికీ… ఏపీలో కాంగ్రెస్ పార్టీకు ఉన్న జన బలం… వైసీపీ అధికార బలం ముందు తేలిపోతుంది. దీనితో షర్మిలకు మద్దత్తుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా భరోసా కల్పించడం… షర్మిలతో పాటు కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం రేపుతోంది.

Also Read : Pakistan Spy Arrested: ఐఎస్‌ఐ గూఢచారిని అరెస్ట్ చేసిన యూపీ ఏటీఎస్ !

Leave A Reply

Your Email Id will not be published!