Rahul Gandhi : కాంగ్రెస్ (Congress) అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఇవాళ కూడా పెట్రోల్ (Petrol) , డీజిల్ (Diesel) ధరల వాయింపు ప్రారంభమైంది.
ఏడు రోజులు వరుసగా పెట్రోల్ (Petrol) , డీజిల్ (Diesel) పై లీటర్ కు 80, 90 పైసలు పెంచుకుంటూ వస్తున్నాయి చమరు కంపెనీలు. ఇంకో వైపు గ్యాస్ ధర కూడా కొండెక్కింది.
ఈ తరుణంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) మొదటి నుంచీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని (Narendra Modi) టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈనెల 31న దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ (Congress) పార్టీ. గంటలు మోగించాలని కోరింది.
తాజాగా మోదీ (Modi)పై సెటైర్ విసిరారు రాహుల్ గాంధీ(Rahul Gandhi ). మోదీ (Modi) ప్రతి రోజు దిన చర్య ఒక్కటే. పెట్రోల్ (Petrol) , డీజిల్ (Diesel) , గ్యాస్ ధరలు పెంచడం. ఆ తర్వాత ప్రభుత్వ ఆస్తులను తనకు ఇష్టమైన ఆ ముగ్గురు వ్యాపారవేత్తలకు కట్టబెట్టడం అంటూ ఆరోపించారు.
ఈ మేరకు రోజ్ సుబా కి బాత్ అనే పేరుతో హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి అనేక సమస్యలపై ప్రధానిపై దాడి చేశారు. మాటల తూటాలు పేల్చారు.
రైతులను మరింత నిస్సహాయులుగా మార్చడం. ధరలు పెంచడం, సామాన్యులపై భారం మోపడం, యువతకు ఉపాధిపై బొమ్మల కలలు చూపిస్తున్నారంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు.
ప్రధాని రోజూ వారీ చేయాల్సిన పనులు ఇవే. పెట్రోల్, డీజిల్ , గ్యాస్ రేట్లు ఎంత పెంచాలనే దానిపై దినచర్య మొదలవుతుందని పేర్కొన్నారు. రైతులకు ఈరోజు వరకు ఎంఎస్పీ ధర కల్పించిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు.
Also Read : ఆర్యన్ కేసు..గడువు కోరిన ఎన్సీబీ