Rahul Gandhi Birsa Munda : భారత దేశం గర్వించ దగిన పోరాట యోధులలో చిరస్మరణీయమైన వ్యక్తి బిర్సా ముండా అని పేర్కొన్నారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. ట్విట్టర్ వేదికగా శుక్రవారం స్పందించారు. జూన్ 9న బిర్సా ముండా వర్దంతి. ఈ సందర్బంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. గిరిజన సమాజానికి గౌరవ ప్రదమైన నాయకుడని కొనియాడారు. భగవాన్ బిర్సా ముండా చేసిన త్యాగం గొప్పదని ప్రశంసించారు. అన్యాయానికి వ్యతిరేకంగా చివరి వరకు పోరాడిన గొప్ప నాయకుడని గుర్తు చేశారు.
ఆది వాసీలకు సంబంధించిన భూమి వారికే చెందాలని నినదించడమే కాదు సమస్త గిరిజన సమాజాన్ని ఏకం చేసిన ఏకైక యోధుడు బిర్సా ముండా అని కితాబు ఇచ్చారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఆయన అందించిన స్పూర్తి ఎల్లకాలం నిలిచి ఉంటుందని స్పష్టం చేశారు. ఆనాడు బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా వ్యక్తిగతంగా ఆదివాసీ బిడ్డలతో ప్రత్యేక సైన్యాన్ని తయారు చేసిన గొప్ప యోధుడని అన్నారు.
కేవలం బతికింది 25 ఏళ్లు అయినా ఒక జీవిత కాలం సరిపడా ఆదివాసీ జాతికి మేలు చేకూర్చేలా కృషి చేశాడని, తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడని కొనియాడారు రాహుల్ గాంధీ. ఇవాళ సమస్త గిరిజన సమాజం ఆయనకు రుణపడి ఉందన్నారు. ఎందుకంటే ఆయన గనుక పోరాటం చేయక పోయి ఉండక పోతే వారికి హక్కులు దక్కి ఉండేవి కావని అభిప్రాయ పడ్డారు. ఇవాళ భౌతికంగా లేక పోయినా సూర్య చంద్రులు ఉన్నంత కాలం బిర్సా ముండా బతికే ఉంటారని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.
Also Read : Tom Moody : ఆ ఆరుగురు అద్భుత ఆల్ రౌండర్లు