Rahul Gandhi Vacated : అధికార భవనం ఖాళీ చేసిన రాహుల్
ఎంపీగా అనర్హత వేటు వేసిన సర్కార్
Rahul Gandhi Vacated : ప్రధాని పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి(Rahul Gandhi). ఆయన పెట్టుకున్న పిటిషన్ ను కొట్టి వేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టానికి ఎవరూ అతీతులు కారని పేర్కొంది. ఇదిలా ఉండగా కోర్టు ఎదురు దెబ్బ తర్వాత ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తనకు అధికారికంగా కేటాయించిన బంగ్లాను వదిలి పెట్టారు.
ఆయన2005 నుండి ఇదే బంగ్లాలో ఉంటున్నారు. ఇక అనర్హత వేటు పడిన ఎంపీకి ప్రభుత్వ వసతి పొందేందుకు అర్హత ఉండదు. తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసేందుకు ఒక నెల వ్యవధి ఉంటుంది.
పార్లమెంట్ దిగువ సభ ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో గడువు ముగిసేందుకు చివరి రోజైన శనివారం సెంట్రల్ ఢిల్లీ లోని తన అధికారిక నివాసాన్ని రాహుల్ గాంధీ ఖాళీ(Rahul Gandhi Vacated) చేశారు. ఆయనతో పాటు సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఉదయం నుంచి రెండుసార్లు బంగ్లాను సందర్శించారు.
బీజేపీ ఎంపీ సీఆర్ పాటిల్ నేతృత్వంలోని లోక్ సభ హౌసింగ్ కమిటీ 2005 నుండి నివసిస్తున్న 12 తుగ్లక్ లేన్ బంగ్లాను ఏప్రిల్ 22 వ తేదీ లోగా ఖాళీ చేయాలని నోటీసు పంపింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఇవాళ బంగ్లా నుంచి వైదొలిగారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ దీనిని కక్ష సాధింపు చర్యగా పేర్కొంది.
Also Read : పంజాబ్ సర్కార్ కు అమిత్ షా కితాబు