Rahul Gandhi Viral : రాహుల్ గాంధీ వైర‌ల్

సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్

Rahul Gandhi Viral  : న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ వైర‌ల్ గా మారారు. ప్ర‌త్యేకించి సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో క‌లుస్తున్నారు. మెకానిక్ లు, డ్రైవ‌ర్లు, కూలీల‌తో క‌లిసి త‌ను కూడా క‌లిసి పోయేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Rahul Gandhi Viral with Carpenters

త్వ‌ర‌లో దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో ఓ వైపు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ హ‌వాను త‌ట్టుకుని నిల‌బ‌డేందుకు నానా తంటాలు ప‌డుతున్నాయి ప్ర‌తిప‌క్షాలు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచారు. కార‌ణం ఈ యువ నాయ‌కుడు ప్ర‌స్తుతం పార్టీకి కేరాఫ్ గా మారారు.

యోగేంద్ర యాద‌వ్ భార‌త్ జోడో యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. ఇది దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది ప్ర‌పంచాన్ని త‌న వైపు తిప్పుకునేలా చేశారు రాహుల్ గాంధీ. ఈ త‌రుణంలో అన్ని వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌ల‌ను క‌లుసుకున్నారు.

ఇదే స‌మ‌యంలో సామాన్యులు, శ్రామికులు, క‌ర్ష‌కులు, కార్మికులు, రైతుల‌తో ముచ్చ‌టించారు. తాజాగా కార్పెంట‌రీ షాప్ వ‌ద్ద‌కు వెళ్లారు రాహుల్ గాంధీ. అక్క‌డ కిటికీలు త‌యారు చేస్తుండ‌గా స‌పోర్ట్ చేశారు యువ నాయ‌కుడు. దీంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి. ఎంతైనా రాహులా మ‌జాకా అని పార్టీ నేత‌లు విస్తు పోతున్నారు.

Also Read : Mynampally Hanumantha Rao : కాంగ్రెస్ లో చేరిన మైనంప‌ల్లి

Leave A Reply

Your Email Id will not be published!