Rahul Gandhi : ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ వైరల్ గా మారారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా వివిధ వర్గాల వారిని కలుసుకున్నారు. వారి సమస్యలను అర్థం చేసుకున్నారు. ఇందులో భాగంగా నిత్యం కార్మికులు పడుతున్న కష్టాల గురించి ఆవేదన చెందారు. ఇందుకు సంబంధించి కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించాలని సూచించారు. దీనినే ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకు వెళుతోంది అక్కడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.
Rahul Gandhi On Bike
రాజస్థాన్ లోని 3 లక్షల మందికి పైగా కార్మికులు ఉన్నారు. వారి హక్కులు కాపాడేందుకు, ఆత్మ గౌరవం కల్పించేందుకు రాష్ట్ర సర్కార్ రాహుల్ సూచనలు స్వీకరించింది. ఈ మేరకు ఒక కొత్త చట్టాన్ని తీసుకు వచ్చింది. ఇది భారత దేశంలోనే మొదటి చట్టం. కార్మికులకు ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. కోట్లాది మంది యువతకు గ్యారెంటీ కల్పిస్తుంది.
జోడో ప్రయాణంలో గిగ్ వర్కర్స్ , టాక్సీ డ్రైవర్లు, డెలివరీ మెన్ లను రాహుల్ గాంధీ(Rahul Gandhi) కలిశారు. ఎల్లప్పుడూ వీధుల్లో పని చేయడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్నారు. కానీ వారికి ఆర్థిక భద్రత లేదు. అసంఘిత రంగంలో పని చేస్తున్న వారి సంఖ్య కోట్లల్లో ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ చేసిన సూచన ఎందరికో భద్రతను కల్పించేలా చేసింది. ఇలాంటి నేతలే దేశానికి కావాల్సింది .
Also Read : MS Dhoni Entertainment : ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ స్టార్ట్