Rahul Gandhi : రూటు మార్చిన రాహుల్ గాంధీ
కొత్త అవతారంలో కనిపించిన నేత
Rahul Gandhi New Look : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) రూటు మార్చారు. దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ అనే నినాదంతో దేశంలో భారత్ జోడో యాత్ర చేపట్టారు. 150 రోజులకు పైగా యాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయన వేషధారణ కూడా మార్చేశారు.
పూర్తిగా గడ్డంతో కనిపించారు. చివరి దాకా కూడా రాహుల్ గాంధీ టీ షర్ట్ తోనే ఉన్నారు. తాజాగా ఆయన లండన్ లోని కేంబ్రిడ్జి యూనివర్శిటీలో ప్రసంగించే కంటే ముందు పూర్తిగా తన డ్రెస్ ను(Rahul Gandhi New Look) మార్చేశారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. రాహుల్ గాంధీ యుకెలో వారం రోజుల పాటు పర్యటించారు. తెల్లటి షర్ట్ కు బదులుగా సూట్ – టైలో అందంగా కనిపించారు.
21వ శతాబ్దంలో వినడం నేర్చుకోవడం అన్నది ముఖ్యం కావాలని పిలుపునిచ్చారు యువ నాయకుడు. తమ నాయకుడికి చెందిన ఫోటోలను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సీనియర్లు, పార్టీకి చెందిన బాధ్యులు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీని ప్రశంసలతో ముంచెత్తారు.
ఇదిలా ఉండగా ప్రతిష్టాత్మకమైన కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన తన అనుభవాలను వారితో పంచుకున్నారు.
భారత దేశం పట్ల తనకు ఉన్న కలల్ని, విజన్ ను కూడా వివరించారు. తన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ దేశం మొత్తం కలిసి ఉండాలన్నదే తన కోరిక అని స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్ర సందర్బంగా తాను చూసిన సమస్యలను ఏకరువు పెట్టారు. ఏదో ఒక రోజు దేశానికి నాయకత్వం వహించ గలనన్న నమ్మకాన్ని ఆయన ప్రకటించారు.
Also Read : ఆర్బీఐ గవర్నర్ తో బిల్ గేట్స్ భేటీ