Rahul Gandhi Yatra Comment : కాంగ్రెస్ శ్రేణుల్లో యాత్ర జోష్
రాహుల్ గాంధీకి అనూహ్య ఆదరణ
Rahul Gandhi Yatra Comment : భారత దేశ రాజకీయ రంగం పెను కుదుపులకు, మార్పులకు లోనవుతూ వస్తోంది. భారతీయ జనతా పార్టీ పూర్తిగా తమ ముందు నరేంద్ర మోదీని పెట్టుకుని అడుగులు వేస్తోంది. కాషాయానికి బలం చేకూర్చేలా దాని అనుబంధ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఈ తరుణంలో గతంలో చోటు చేసుకున్న పరిస్థితులను బేరీజు వేసుకుంటూ రాబోయే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి బలం పుంజుకునేందుకు ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. సంప్రదాయానికి ఆధునికతకు మధ్య పార్టీ ఊగిస లాడుతున్నట్లు కనిపిస్తోంది.
సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.
రాజస్థాన్ లో నెలకొన్న సంక్షోభాన్ని సరిగా డీల్ చేయలేక పోయిందన్న ఆరోపణలు మూటగట్టుకుంది. ఇక అక్టోబర్ 17న పార్టీకి సంబంధించి గాంధీయేతర వ్యక్తి చీఫ్ గా ఎంపిక కానున్నారు. ఈ రేసులో గాంధీకి విధేయుడిగా పేరొందిన మల్లికార్జున్ ఖర్గే ఉండగా అసమ్మతి గ్రూపుగా భావిస్తున్న జి23 టీమ్ లో ఒకడిగా పేరొందిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ పోటీలో ఉన్నారు.
దేశంలోని మొత్తం రాష్ట్రాలలో ఎక్కువ రాష్ట్రాలు బీజేపీ చేతిలో ఉన్నాయి. ఇక కేవలం రెండే రెండు రాష్ట్రాలలో పూర్తి స్థాయి అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న పంజాబ్ ను కోల్పోయింది. పార్టీ నేతల మధ్య సమన్వయం లేక పోవడం ప్రధాన కారణం. ఎన్నడూ లేని రీతిలో ఆప్ అక్కడ పాగా వేసింది. ఏకంగా 92 సీట్లతో పవర్ లోకి వచ్చింది. త్వరలో రాజస్తాన్, గుజరాత్ లలో ఎన్నికలు జరగనున్నాయి.
ఇక ఒకప్పుడు కీలకమైన సీట్లు కలిగిన యూపీలో ఈసారి ఒక్క సీటు కూడా రాక పోవడం ఆ పార్టీ ఎదుర్కొంటున్న తీవ్రమైన స్థితిని తెలియ పరుస్తుంది.
అక్కడ ప్రియాంక అన్నీ తానై వ్యవహరించినా రెండోసోరా యూపీ సీఎం యోగి మళ్లీ పవర్ లోకి వచ్చారు. ఇక మహారాష్ట్రలో సంకీర్ణ సర్కార్ లో భాగస్వామిగా ఉన్నా పవర్ కోల్పోయింది.
తాజాగా బీహార్ లో కొలువు తీరిన నితీశ్ కుమార్ ప్రభుత్వంలో ఉంది. ఇదంతా పక్కన పెడితే పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చేందుకు నడుం బిగించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi Yatra).
త్వరలో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. మోదీ ఎనిమిదేళ్ల పాలనలో దేశం ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది, ఎంత వెనక్కు వెళ్లిందనే దానిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
ఆయన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోంది.
మొత్తం 3,570 కిలోమీటర్లు 150 రోజుల యాత్రను కొనసాగిస్తూ వస్తున్నారు. రాహుల్ చేపట్టిన ఈ పాదయాత్ర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మళ్లీ జీవం పోసేలా కనిపిస్తోంది.
అన్ని వర్గాల ప్రజలు రాహుల్ ను ఆదరిస్తున్నానరు. ఆయన ప్రధానంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి ఏకరువు పెడుతున్నారు.
ఇంటి పోరుతో పాటు బయటి పోరును కూడా సమర్థవంతంగా రాహుల్ గాంధీ ఎదుర్కోగలిగితే ఆయనకు తిరుగంటూ ఉండదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఏది ఏమైనా పార్టీ భవిత్యం మాత్రం ఖర్గే లేదా థరూర్ చేతుల్లో లేదు సోనియా..రాహుల్, ప్రియాంక గాంధీల చేతుల్లో ఉందన్నది వాస్తవం.
Also Read : 14న రాజీవ్ స్వగృహ ఆస్తుల వేలం