Rahul Gandhi Yatra : రాహుల్ యాత్రకు జనం జేజేలు
కల్లోల కాశ్మీరంలో సైతం మద్దతు
Rahul Gandhi Yatra : ఎప్పుడైతే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారో ఆనాటి నుంచి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. ఆయన ఏం చేసినా లేదా ఏది మాట్లాడినా వైరల్ గా మారింది. కేంద్రంలో కొలువు తీరిన మోదీ భారతీయ జనతా పార్టీ , దాని అనుబంధ సంస్థలు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ వచ్చాయి.
ఆయనను పప్పు అని గేలి చేస్తూ వచ్చాయి. కానీ తాను పప్పు (మూర్ఖుడు) కాదని నిజమైన భారతీయుడినని నిరూపించుకున్నారు. రాహుల్ గాంధీ లేవనెత్తిన సమస్యలు, ప్రస్తావించిన అంశాలకు ఇప్పటి వరకు ప్రధానమంత్రి మోదీ కానీ ఆయన పరివారం కానీ సమాధానం చెప్పిన దాఖలాలు లేవు.
ఇక రాహుల్ గాంధీకి ఊహించని రీతిలో భారత్ జోడో యాత్రకు(Rahul Gandhi Yatra) అడుగడుగునా ఆదరణ లభిస్తోంది. వేలాది మంది స్వచ్ఛంధంగా తరలి వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. ఓ వైపు వర్షం వస్తున్నా ఇంకో వైపు చలి వణికిస్తున్నా ఎక్కడా లెక్క చేయడం లేదు కాంగ్రెస్ అగ్ర నాయకుడు.
ఆయన ఈ దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ అంటూ పిలుపునిచ్చారు. ఇప్పుడు ముస్లింలు సైతం రాహుల్ గాంధీని ప్రేమిస్తున్నారు. అక్కున చేర్చుకుంటున్నారు. ఆయనను కలిసేందుకు పోటీ పడుతున్నారు. తాజాగా బుధవారం జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో పెద్ద ఎత్తున ముస్లిం మహిళలు రాహుల్ గాంధీని కలుసుకున్నారు.
ఆయనతో పాటు అడుగులో అడుగులు వేశారు. ఓ వైపు అత్యంత భద్రత మధ్య ఆయన తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
Also Read : లఖింపూర్ ఘటనలో మిశ్రాకు బెయిల్