PM Modi : రాహుల్..మేధా పాట్క‌ర్ అభివృద్ది నిరోధ‌కులు

నిప్పులు చెరిగిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ

PM Modi : దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త మేధా పాట్క‌ర్ తో క‌లిసి భార‌త్ జోడో యాత్ర చేప‌ట్ట‌డంపై మండిప‌డ్డారు. ఈ దేశం అభివృద్ది చెంద‌కుండా అడ్డు ప‌డుతున్న వారిలో రాహుల్ , మేధా పాట్క‌ర్ లు ముందుంటారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

దేశాన్ని స‌ర్వ నాశ‌నం చేసిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీకే ద‌క్కుతుంద‌న్నారు. తాము అధికారంలోకి వ‌చ్చాక అన్ని రంగాల‌లో ముందంజ‌లో తీసుకు వెళ్లేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని చెప్పారు. రాబోయే 2025 నాటికి భార‌త్ అన్ని దేశాల కంటే ముందంజ‌లో ఆర్థిక రంగంలో దూసుకు పోవ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు న‌రేంద్ర మోదీ.

ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేక‌, పోటీని త‌ట్టుకోలేక రాహుల్ గాంధీ పాద‌యాత్ర చేప‌ట్టారంటూ ఎద్దేవా చేశారు ప్ర‌ధాన‌మంత్రి(PM Modi). రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు గుజ‌రాత్ లోని ధోరాజీలో ఆదివారం జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో మోదీ కీల‌క ప్ర‌సంగం చేశారు.

మూడు ద‌శాబ్దాలుగా న‌ర్మదా డ్యామ్ ప్రాజెక్టును అడ్డుకున్న మ‌హిళా నాయ‌కురాలితో క‌లిసి కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు పాద‌యాత్ర ఎలా చేప‌డ‌తారంటూ ప్ర‌శ్నించారు. ఇలాంటి అభివృద్ది నిరోధ‌కుల‌తో ఎలా ఓట్లు అడిగేందుకు వ‌స్తారంటూ నిల‌దీశారు ప్ర‌ధాన‌మంత్రి.

ఇక్క‌డికి వ‌స్తే రాహుల్ గాంధీని నిల‌దీయాలంటూ న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇదిలా ఉండ‌గా మేధా పాట్క‌ర్ న‌వంబ‌ర్ 17న మ‌హారాష్ట్ర‌లో భార‌త్ జోడో యాత్ర‌లో రాహుల్ గాంధీతో పాటు పాల్గొన్నారు. దీనిని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

Also Read : వీడిన చెర‌సాల గృహ నిర్బంధానికి న‌వ్లాఖా

Leave A Reply

Your Email Id will not be published!