Rahul Navin: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొత్త డైరెక్టర్‌ గా రాహుల్ నవీన్ !

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొత్త డైరెక్టర్‌ గా రాహుల్ నవీన్ !

Rahul Navin: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొత్త డైరెక్టర్‌ గా రాహుల్ నవీన్ బుధవారం నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ధ్రువీకరించింది. పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల పాటు, లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఈడీ డైరెక్టర్‌గా ఆయన కొనసాగుతారని తెలిపింది.

Rahul Navin…

యాభై ఏడేళ్ల రాహుల్ నవీన్ 2019 నవంబర్‌ లో ఈడీ స్పెషల్ డైరెక్టర్‌ గా నియమితులయ్యారు. 1993 ఐఆర్ఎస్ ఆఫీసర్ బ్యాచ్‌ కు చెందిన ఆయన గత ఏడాది సెప్టెంబర్‌లో ఈడీ యాక్టింగ్ డైరెక్టర్‌ గా బాధ్యతలు చేపట్టారు. ఇన్‌ టర్మ్ ఈడీగా ఆయన హయాంలోనే వేర్వేరు మనీలాండరింగ్ కేసుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టయ్యారు. ఈడీ డైరెక్టర్‌గా సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని తరచు పొడిగించడం సరికాదంటూ సుప్రీంకోర్టు అప్పట్లో స్పష్టం చేయడంతో రాహుల్ నవీన్‌ ను ఈడీ యాక్టింగ్ చీఫ్‌ గా కేంద్రం నియమించింది.

Also Read : Rahul Gandhi : కోల్‌కతా ట్రైన్ డాక్టర్ మృతిపై స్పందించిన రాహుల్ గాంధీ

Leave A Reply

Your Email Id will not be published!