Rahul Ramakrishna : సినిమాలకు రాహుల్ రామ‌కృష్ణ గుడ్ బై

క‌మెడియ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Rahul Ramakrishna  : సైన్మా ల‌ఘు చిత్రంతో పాపుల‌రై గీత గోవిందం, జాతి ర‌త్నాలు, అర్జున్ రెడ్డి, జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా, త‌దిత‌ర సినిమాల‌తో టాప్ క‌మెడియ‌న్ గా పేరొందిన రాహుల్ రామ‌కృష్ణ (Rahul Ramakrishna )సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

తాను ఇక నుంచి సినిమాల‌లో న‌టించ‌నంటూ ప్ర‌క‌టించి విస్తు పోయేలా చేశాడు. ర‌చ‌యితగా, జ‌ర్న‌లిస్టుగా, న‌టుడిగా ఇప్ప‌టికే పేరు తెచ్చుకున్నారు రాహుల్ రామ‌కృష్ణ‌. వివిధ అంశాలపై అత‌డికి మంచి ప‌ట్టుంది.

ఈ ఏడాది వ‌ర‌కు మాత్ర‌మే తాను న‌టిస్తాన‌ని స్ప‌ష్టం చేశాడు. ఈ విష‌యాన్ని త‌న అధికారిక ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించాడు ఇవాళ‌. ఇదే నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని పేర్కొన్నాడు రాహుల్ రామ‌కృష్ణ(Rahul Ramakrishna ).

ఇదిలా ఉండ‌గా మంచి భవిష్య‌త్తు ఉన్న అత‌ను ఎందుకు ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడ‌నేది తెలియ‌డం లేదు. ఆయ‌న అభిమానులు తీసుకున్న నిర్ణ‌యంతో షాక్ కు గుర‌య్యారు. స‌న్నిహితులు సైతం ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు.

రాహుల్ రామ‌కృష్ణ‌కు అత్యంత స‌న్నిహితుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇప్ప‌టికే త‌ను తెలుగు, హిందీ మూవీస్ లో న‌టిస్తూ బిజీగా మారాడు. ఇక రాహుల్ కు గీత గోవిందం మూవీ బిగ్ పేరు తీసుకు వ‌చ్చేలా చేసింది.

ఇక జాతి ర‌త్నాలు మూవీలో రామ‌కృష్ణ న‌ట‌నకు వంద మార్కులు ప‌డ్డాయి. ఏమైనా ప్రాంక్ చేస్తున్నారా లేక దీనికేమైనా వెబ్ సీరీస్ పేరు పెట్టారా అంటూ నెటిజ‌న్లు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ఇక క‌ల్కి, స్కైలాబ్ మూవీస్ లో న‌టించి మెప్పించిన రాహుల్ ఎందుకిలా అన్న‌దే మిలియ‌న్ డాల‌ర్ ప్ర‌శ్న‌.

Also Read : ఏం కావాల‌న్నా జొమాటా ఉందిగా

Leave A Reply

Your Email Id will not be published!