Rain Alert: దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన: ఐఎండీ హెచ్చరిక!
దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన: ఐఎండీ హెచ్చరిక!
Rain Alert: గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల భారీ నుండి అతి భారీవర్షాలు(Rain Alert) కురుస్తున్నాయి. దీంతో నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ సహా 18 రాష్ట్రాల్లో వానలు కురియనున్నట్లు వెదర్ రిపోర్ట్ తెలిపింది.
దేశంలో నైరుతి రుతుపవనాలు పర్వతాల నుంచి మైదానాల వరకు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలోనే అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నేడు, రేపు కూడా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని గంగా తీరాలలో సెప్టెంబర్ 15 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది.
Rain Alerts..
ఇది కాకుండా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, సిక్కిం, మహారాష్ట్ర, గుజరాత్ అన్ని ఈశాన్య రాష్ట్రాలలో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు మిజోరాం, త్రిపుర, అసోం, మేఘాలయ, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్ ప్రాంతాల్లో సెప్టెంబరు 14,15 తేదీల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మరో వైపు విరిగిపడుతున్న కొండచరియలు
జమ్మూ కశ్మీర్‌లోని కత్రాలోని త్రికూట పర్వతంపై రోజంతా పొగమంచు కారణంగా మా వైష్ణో దేవి వద్దకు హెలికాప్టర్లు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయినప్పటికీ, బ్యాటరీ కార్, రోప్‌వే సేవలు కొనసాగించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి సుమారు 18 వేల మంది భక్తులు అమ్మవారిని కొలుస్తూ భవనం వైపు బయలుదేరారు. జ్యోతిర్మఠం-మలారి రహదారిని మూసివేయడంతో 47 మంది వ్యక్తులు మార్గమధ్యంలో చిక్కుకుపోయారు. పార్థదీప్‌లో కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ హైవే శుక్రవారం రోజంతా మూసివేయబడింది.
Also Read : Ranganath: హైకోర్టు పలు ప్రశ్నలు సంధించిన వేళ కీలక వ్యాఖ్యలు !: రంగనాథ్