Rain Forecast: తెలంగాణలో ఈ నెల 30 వరకు భారీ వర్షాలు

తెలంగాణలో ఈ నెల 30 వరకు భారీ వర్షాలు

Rain Forecast : అల్ప పీడనాల ప్రభావంతో తెలంగాణలో ఈ నెల 30వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం 12 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది.. గురువారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది ఈనెల 26 నాటికి వాయుగుండంగా మారనుందని వాతావరణకేంద్రం వెల్లడించింది. తదుపరి ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఈనెల 27న తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం భారి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Rain Forecast in Telangana

ఇవాళ మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గురువారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. శుక్రవారం నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్ సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Also Read : Air Chief Marshal: మిగ్‌-21కు స్వయంగా వీడ్కోలు పలకనున్న వాయుసేన చీఫ్‌

Leave A Reply

Your Email Id will not be published!