Raj Kasireddy: విజయసాయి రెడ్డిపై సంచలన ఆడియో రిలీజ్ చేసిన రాజ్‌ కసిరెడ్డి

విజయసాయి రెడ్డిపై సంచలన ఆడియో రిలీజ్ చేసిన రాజ్‌ కసిరెడ్డి

Raj Kasireddy : గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు… ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా వెడెక్కిస్తోంది. శుక్రవారం సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి… ఈ మద్యం కుంభకోణంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అంతా రాజ్ కసిరెడ్డి అని కుండ బద్దలు గొట్టారు. అంతేకాదు రాజ్ కసిరెడ్డి ప్రభుత్వాన్ని, ప్రజలను మోసం చేసారని… అత్యంత క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న ఇలాంటి వ్యక్తిని తాను ఎప్పడూ చూడలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. మరోవైపు శనివారం సిట్ అధికారుల ఎదుట… వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు.

Raj Kasireddy Audio Viral

అయితే మద్యం కుంభకోణం కేసులో శనివారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రదారుడు, నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy)… ఓ సంచలన ఆడియోను రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన ఆడియోలో రాజ్ కసిరెడ్డి మాట్లాడుతూ… ‘‘మార్చిలో సిట్‌ అధికారులు మా ఇంటికి వచ్చారు. నేను లేనప్పుడు మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. నేను విచారణఖు సహాకరిస్తాను. డాక్యుమెంట్స్ ఏమైనా కావాలా అని అడిగాను.

అయితే వారు విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉందని నా లాయర్లు చెప్పడంతో బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాను. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేశా. న్యాయపరమైన రక్షణ తర్వాత విచారణకు హాజరవుతా. సాక్షిగా పిలిచి అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని లాయర్లు చెప్పారు. అందుకోసమే న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. అయితే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి నాపై ఆరోపణలు చేసారు. విజయసాయిరెడ్డి ఒక బట్టేబాజ్ మనిషి. అతని చరిత్ర అంతా నాకు తెలుసు. నా న్యాయపోరాటం అయిన తరువాత మీడియాను పిలిచి… ఆయన చరిత్ర అంతా బయటపెడతా ’’ అని ఆ ఆడియోల రాజ్‌ కసిరెడ్డి తెలిపారు.

Also Read : MP Mithun Reddy: మద్యం కుంభకోణం కేసులో సిట్ ఎదుట హాజరైన ఎంపీ మిథున్‌ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!