ABK Prasad Award : ఏబీకేకు రామ్మోహన్ రాయ్ అవార్డు
పాత్రికేయ వృత్తిలో అపారమైన అనుభవం
ABK Prasad Award : తెలుగు పాత్రికేయ రంగంలో ప్రముఖుడిగా , అద్భుతమైన సంపాదకుడిగా పేరొందిన డాక్టర్ ఏబీకే ప్రసాద్ కు అరుదైన గౌరవం లభించింది. దేశంలోనే అత్యున్నతమైన పురస్కారంగా భావించే రాజా రామ్మోహన్ రాయ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఏబీకే అంటేనే ఓ బ్రాండ్. అక్షరాలతో అమృతాన్ని జత చేర్చగలడు..అదే సమయంలో అగ్ని కీలలను సృష్టించ గలడు.
జర్నలిజంలో విశిష్టమైన సేవలు అందించినందుకు గాను ఈ గౌరవంతో సత్కరిస్తున్నట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ సారథ్యంలోని కమిటీ ప్రకటించింది. ఈ అవార్డును ఈనెల 28న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో డాక్టర్ ఏబీకే ప్రసాద్ కు (ABK Prasad Award ) అందజేయనుంది కమిటీ. ఏబీకే ప్రసాద్ పలు పత్రికలకు ఎడిటర్ గా పని చేశారు. ఇదిలా ఉండగా ఏబీకే పూర్తి పేరు డాక్టర్ అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ .
తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణలలో ప్రాంతీయ జర్నలిజంకు ఆద్యుడిగా పేరొందారు. వేలాది మంది జర్నలిస్టులను తయారు చేశారు ఏబీకే ప్రసాద్. ఇవాళ పేరొందిన పత్రికలలో ఆయన శిష్యులే ప్రధాన పోస్టులలో ఉన్నారు. ఇది ఏబీకే ఘనత. ఇక జర్నలిజం రంగంలో 75 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.
ఏబీకే ప్రసాద్ 2004 -2009 వరకు ఏపీ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా కూడా పని చేశారు . కాగా ఏబీకే ప్రసాద్ కు అరుగైన అవార్డు దక్కడం పట్ల సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు అభినందనలు తెలిపారు. తనకు అవార్డును ప్రకటించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఏబీకే.
Also Read : తేజస్ జెట్ ఆత్మ నిర్భర్ కు దర్పణం