Raja Singh : రాజా సింగ్ పై బీజేపీ ఫోకస్
బీజేపీ టికెట్ ఇస్తుందా
Raja Singh : తెలంగాణ భారతీయ జనతా పార్టీలో డైనమిక్ లీడర్ గా గుర్తింపు పొందారు గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. ఆ మధ్యన ముస్లింలను టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఆయనపై పీడీ యాక్టు నమోదు చేశారు ఖాకీలు. దేశంలో ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్టు నమోదు చేయడం ఇదే తొలిసారి. ఆ తర్వాత రాజా సింగ్ ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Raja Singh Comments Viral
విచిత్రం ఏమిటంటే రాజాసింగ్ పార్టీ కేంద్రంలో కొలువు తీరి ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ఉన్నప్పటికీ రాజా సింగ్ పై పీడీ యాక్టును ఎత్తివేయలేక పోయారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ కావాలని తనపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించిందని ఆరోపించాడు .
అంతే కాదు తనంటే తన పార్టీలోని కొందరికి పడదంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. దీంతో పార్టీ రాజా సింగ్(Raja Singh) పై వేటు వేశారు. సస్పెన్షన్ వేటు వేసినా పార్టీని అంటిపెట్టకుని ఉన్నారు. తాజాగా తెలంగాణలో ప్రస్తుతం శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా లిస్టు ఖరారు కాలేదు.
ఇంకా రెండు రోజుల్లో జాబితా ప్రకటిస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వెల్లడించారు. పార్టీ హైకమాండ్ దీనిపై కసరత్తు చేస్తోంది. బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, తరుణ్ జుగ్ హాజరయ్యారు.
Also Read : Rahul Gandhi : రాహుల్ దోస మేకర్