Jailer Movie : తమిళ సూపర్ స్టార్ తలైవా రజనీ కాంత్ నటించిన జైలర్ చిత్రం వచ్చే ఆగస్టు 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతో కోట్లాది మంది అభిమానులకు ఇక పండుగే అని చెప్పక తప్పదు.
మేకింగ్ లో టేకింగ్ లో డిఫరెంట్ గా ప్రజెంట్ చేసే దర్శకుడిగా గుర్తింపు పొందిన నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ కు కథను రాయడమే కాదు దర్శకత్వం వహించారు. ఇందులో రజనీకాంత్ తో పాటు లవ్లీ గర్ల్ తమన్నా భాటియా నటించింది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే చిత్రం పరంగా విడుదల చేసిన పోస్టర్స్ , టీజర్, కావాలా సాంగ్ దుమ్ము రేపాయి. ప్రధానంగా సాంగ్ మిలియన్ల కొద్దీ వీక్షించారు. సోషల్ మీడియాను షేక్ చేశాయి. జైలర్(Jailer) చిత్రాన్ని ప్రముఖ మీడియా మొఘల్ గా పేరు పొందిన కళానిధి మారన్ నిర్మించారు.
మూవీకి సంబంధించి రజనీ, తమన్నాతో పాటు రమ్యకృష్ణ, ప్రియాంకా అరుళ్ మోహన్ నటించారు. సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందించారు. మొత్తంగా తలైవా చిత్రం కోసం అంతా ఎదురు చూస్తున్నారు.
Also Read : Dasoju Sravan : దాసోజు శ్రవణ్ కు బెదిరింపు కాల్స్