Rajnath Singh : రాజ్ నాథ్ సింగ్ కీలక కామెంట్స్
త్రివిధ దళాల భాగస్వామ్యంపై ఫోకస్
Rajnath Singh : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక కామెంట్స్ చేశారు. రైలు రంగంలో భారత దేశం వేగంగా అభివృద్ది చెందిందన్నారు. గత ఏడేళ్లలో 9,000 కిలోమీటర్ల లైన్లను రెట్టింపు చేశామని చెప్పారు.
సేవలు ఉమ్మడిగా ఉండటం వల్ల లాజిస్టిక్స్ ఎక్కువగా లాభపడిన రంగాలలో ఒకటి అని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో సాయుధ బలగాల త్రివిధ దళాల భాగస్వామ్యానికి భారత దేశం వేగంగా అడుగులు వేస్తోందని చెప్పారు రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh).
ఒక సర్వీస్ కు సంబంధించిన వనరులు మరొక సేవకు సజావుగా అందుబాటులో ఉండేలా చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి లాజిస్టిక్ నోడ్ లను కలిగి ఉండటమే ప్రయత్నమన్నారు రాజ్ నాథ్ సింగ్.
ఢిల్లీలో ఆర్మీ లాజిస్టిక్స్ పై జరిగిన సెమినార్ లో కేంద్ర మంత్రి రాజజ్ నాథ్ సింగ్ ప్రసంగించారు. రైలు రంగంలో భారత దేశం అనూహ్యంగా అభివృద్ది చెందిందని చెప్పారు.
గత ఏండు సంవత్సరాల కాలంలో గణనీయమైన పురోభివృద్ధి చోటు చేసుకుందన్నారు. లైన్లు రెట్టింపు అయ్యాయని తెలిపారు. 2014 సంవత్సరాని కంటే ముందు అంటే తాము పవర్ లోకి రాక ముందు కేవలం 1,900 కిలోమీటర్లు మాత్రమే ఉండేదన్నారు.
కానీ తాము అధికారంలోకి వచ్చాక సీన్ మారిందన్నారు. ఇదిలా ఉండగా సెమినార్ ప్రారంభ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరి కుమార్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సరస్వత్ పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read : అహ్మదాబాద్ ఆప్ ఆఫీస్ పై పోలీసుల దాడి
Speaking at the Indian Army Logistics Seminar in New Delhi. https://t.co/Aw7eUFVixA
— Rajnath Singh (@rajnathsingh) September 12, 2022