Rajnath Singh : గాల్వాన్ లేదా త‌వాంగ్ ఏదైనా స‌రే

చైనాతో ఢీకొనేందుకు భార‌త్ సిద్దం

Rajnath Singh : గాల్వాన్ లేదా త‌వాంగ్ ఏదైనా స‌రే తాము చైనాను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామ‌ని కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్ప‌ష్టం చేశారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లోని స‌రిహ‌ద్దు వ‌ద్ద చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య భార‌త ద‌ళాల‌ను ప్ర‌శంసించారు.

అయితే ఓ వైపు చైనా యుద్దం చేస్తుంటే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని నిద్ర పోతున్నారా అంటూ రాహుల్ గాంధీ ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh). ఇలాంటి చ‌వ‌క‌బారు ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు. ఇలాంటి కామెంట్స్ సైనిక ద‌ళాల ఆత్మ స్థైర్యాన్ని నిర్వీర్యం చేస్తాయ‌న్నారు.

ఇక నుంచి బాధ్య‌త క‌లిగిన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా మెల‌గాల‌ని స్ప‌ష్టం చేశారు రాజ్ నాథ్ సింగ్. శ‌నివారం ఆయ‌న ఇండ‌స్ట్రీ ఛాంబ‌ర్ ఫిక్కీలో మాట్లాడారు. భార‌త బ‌ల‌గాల‌ను ఎంత పొగిడినా స‌రి పోద‌న్నారు. త‌వాంగ్ సెక్టార్ లో ఘ‌ర్ష‌ణ స‌మ‌యంలో భార‌త సాయుధ బ‌ల‌గాలు ప్ర‌ద‌ర్శించిన ధైర్య సాహ‌సాలు అభినంద‌నీయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

ఎలాంటి ప‌దాలు త‌న‌కు రావ‌డం లేద‌ని పేర్కొన్నారు రాజ్ నాథ్ సింగ్. చైనాతో స‌రిహద్దు వివాదంలో అనుమానాలు వ్య‌క్తం కావ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. ఇప్ప‌టికే అగ్నిని విజ‌య‌వంతంగా ప్ర‌యోగించ‌డం జ‌రిగింద‌ని, ప్ర‌పంచంలో అమెరికా, ర‌ష్యా త‌ర్వాత ఒక్క భార‌త్ కు మాత్ర‌మే ఇది సాధ్య‌మ‌ని అన్నారు రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh).

ప్ర‌తిప‌క్షంలో ఉన్న ఏ నాయ‌కుడి ఉద్దేశాన్ని మేం ప్రశ్నించ లేద‌న్నారు. విధానాల ఆధారంగా మాత్ర‌మే చ‌ర్చ‌లు జ‌రిపామ‌న్నారు రాజ్ నాథ్ సింగ్. అబ‌ద్దాల ఆధారంగా ఎక్కువ‌గా రాజ‌కీయాలు చేయ‌లేమ‌న్నారు.

Also Read : ప్ర‌ధాని మోదీ వైఖ‌రి ప్ర‌శంస‌నీయం – యుఎస్

Leave A Reply

Your Email Id will not be published!