Rajnath Singh : మా జోలికి వస్తే ఊరుకోం – రాజ్ నాథ్
చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
Rajnath Singh : సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసేలా దూకుడు ప్రదర్శిస్తున్న డ్రాగన్ చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది భారత్. భారత్ , చైనా దేశాలకు చెందిన రక్షణ శాఖ మంత్రులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్బంగా సమావేశంలో పాల్గొన్న దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటి వరకు తాము శాంతియుతంగా ఉన్నామని, తాము యుద్దాన్ని కోరుకోవడం లేదని పేర్కొన్నారు. కానీ ద్వైపాక్షిక సంబంధాలను కాదని చైనా ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించారు. ఇక నుంచి తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh).
భారత్ మొదటి నుంచి శాంతి కాముక దేశమన్నారు. సరిహద్దులో శాంతి, ప్రశాంతత ముఖ్యమన్నారు. ప్రస్తుత ఒప్పందాలను ఉల్లంఘించడం వల్ల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు రాజ్ నాథ్ సింగ్. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం జరిగింది. చైనా కౌంటర్ జనరల్ లీ షాంగ్ వుతో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కీలక భేటీ అనంతరం కేంద్ర రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. సరిహద్దు వద్ద వాస్తవాధీన రేఖను దాట కూడదు. ఎవరు దాటినా అది ఇరు దేశాలకు మంచిది కాదని పేర్కొన్నారు. ఇకనైనా చైనా తన తీరు మార్చు కోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు రాజ్ నాథ్ సింగ్.
Also Read : విద్వేషం..విధ్వంసం బీజేపీ నేపథ్యం