Biplab Deb : త్రిపుర మాజీ సీఎంకు రాజ్య‌స‌భ సీటు

ప్ర‌క‌టించిన భార‌తీయ జ‌న‌తా పార్టీ

Biplab Deb : త్రిపుర నుంచి రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా బిప్ల‌బ్ దేబ్ ను ప్ర‌క‌టించింది భార‌తీయ జ‌న‌తా పార్టీ. ఆయ‌న త్రిపుర మాజీ సీఎంగా ఉన్నారు. ప్ర‌స్తుతం హర్యానా రాష్ట్ర బీజేపీకి ఇన్ చార్జ్ గా ప్ర‌క‌టించారు జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా.

పార్టీ నియ‌మించిన కొన్ని గంట‌ల త‌ర్వాత రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేయ‌డం విశేషం. సంస్థాగ‌త బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది పార్టీ. త్రిపుర నుంచి రాజ్య‌స‌భ ఉప ఎన్నిక‌ల‌కు పార్టీ ప‌రంగా అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డం పార్టీలో చ‌ర్చ‌కు దారితీసింది.

ఈశాన్య రాష్ట్రాన్ని క్లీన్ స్వీప్ చేసేందుకు 2018 లో బిప్ల‌బ్ దేబ్ దోహ‌ద‌ప‌డ్డారు. ఆయ‌న‌కు గ‌ణ‌నీయ‌మైన ఆద‌ర‌ణ క‌లిగి ఉన్నారు. 25 ఏళ్లుగా త్రిపుర‌లో కొలువు తీరిన వామ‌పక్ష పాల‌న‌కు చ‌ర‌మ గీతం పాడ‌డంలో కీల‌క పాత్ర పోషించారు బిప్ల‌బ్ దేబ్(Biplab Deb).

మా ర్చి 9, 2018న త్రిపుర రాష్ట్రానికి 10వ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది మే 14న రాష్ట్ర సీఎం ప‌ద‌వి నుంచి వైదొలిగారు. అనంత‌రం మే 15న త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

ఇదిలా ఉండ‌గా త్రిపుర నుండి రాజ్య‌స‌భ ఎంపీకి భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్య‌ర్థిగా త‌న‌ను నామినేట్ చేసినందుకు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హొం మంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ న‌డ్డాకు ధ‌న్య‌వాదాలు తెలిపారు బిప్ల‌బ్ దేబ్ .

త్రిపుర ప్ర‌జ‌ల అభివృద్ధి, సంక్షేమం కోసం ప‌ని చేసేందుకు తాను క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు మాజీ సీఎం.

ఇదిలా ఉండ‌గా మాణిక్ సాహా ప‌ద‌వీ కాలం పూర్తి కావ‌డంతో రాజ్య‌స‌భ స్థానానికి ఉప ఎన్నిక‌ల తేదీల‌ను ఖ‌రారు చేసింది భార‌త ఎన్నిక‌ల సంఘం. ఈ ఎన్నిక‌లు సెప్టెంబ‌ర్ 22న జ‌రుగుతాయి.

Also Read : రాజ‌స్థాన్ బీజేపీపై ట్రబుల్ షూట‌ర్ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!