#RakulPreethSingh : టాలీవుడ్ లో రకుల్ హల్ చల్
రకుల్ నటినే కాదు క్రీడాకారిణి..కరాటేలో బ్లాక్ బెల్ట్
Rakul Preeth Singh : టాలీవుడ్ లో ఉన్నట్టుండి మెరిసింది నటి రకుల్ ప్రీతీ సింగ్. ఢిల్లీ లో పుట్టిన ఈ అమ్మాయి గణితంలో ఎక్స్ పర్ట్. అందాలు ఆరబోయడంలోనూ నటించడంలోనూ మిగతా నటీమణుల కు తీసిపోని రీతిలో అడుగులు వేస్తున్నది. అగ్ర నటులతో రకుల్ నటించింది. మెప్పించింది. తాజాగా మహిళా ఫ్యాన్స్ ఎక్కువ కలిగిన నవ మన్మధుడు అక్కినేని నాగార్జున తో కలిసి రాహుల్ రవీంద్రన్ తీసిన మన్మధుడు -2 కీ రోల్ పోషించారు. అన్ని సినిమాలు ఒక ఎత్తు కానీ ఈ మూవీ ఒక ఎత్తు.
ఈ సినిమాలో తనకంటూ స్పెషాలిటీ, ప్రత్యేక వ్యక్తిత్వం కలిగిన నటిగా నటించింది. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ మాత్రం వసూళ్లను రాబట్టింది. ఇందులో కొంచం సీన్స్ ఎబ్బెట్టుగా ఉన్నాయని ఫ్యాన్స్ అభ్యంతరం చెప్పారు. రకుల్ ప్రీతీ సింగ్(Rakul Preeth Singh) .. ప్రముఖ యాంకర్ ఝాన్సీతో కలిసి చేసిన రొమాన్స్ పై రాద్ధాంతం రేగింది. దీనికి సెన్సార్ వారు ఎలా సెర్టిఫికెట్ ఇచ్చారంటూ సినీ క్రిటిక్స్ ప్రశ్నించారు.
అయినా సినిమా విడుదలైంది. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రకుల్ ఝాన్సీ ఇద్దరు కలిసి ముద్దు పెట్టుకుంటారు. ఇదే సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇక నాగార్జున గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన హీరోయిన్స్ తో సాగించిన రొమాన్స్ కుర్రకారును, ఫ్యామిలీస్ ను గిలిగింతలు పెట్టాయి. రకుల్ ప్రీతీ సింగ్ ఇటీవలే తన పుట్టిన రోజు జరుపుకున్నారు. ప్రస్తుతం చేతినిండా రకుల్ కు తెలుగు సినిమాలు ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో నే రకుల్ మకాం పెట్టారు.
టాలీవుడ్ లో రకుల్(Rakul Preeth Singh) టాప్ నటీమణుల్లో ఒకరిగా కొనసాగుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాష సినిమాలలో నటించారు. గతంలో రకుల్ ప్రీతీ సింగ్ ‘మిస్ ఇండియా’గా ఎంపికయ్యింది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకుంది. ఇంటర్ అయి పోయాక పాకెట్ మనీ కోసం ఓ కన్నడ సినిమాలో హీరోయిన్గా నటించింది. తరవాత మళ్లీ వెళ్లి డిగ్రీ పూర్తి చేసింది.
తెలుగులో మొదటి సారిగా కెరటం సినిమాలో నటించింది. తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీలో నటించింది. రకుల్ నటనలోనే కాదు క్రీడాకారిణి కూడా. జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణి గా పేరు తెచ్చుకుంది. అనేక టోర్నమెంట్లు గెలిచింది కూడా. ఆమెకు గుర్రపుస్వారీ, భరతనాట్యం సాధన చేయడం అంటే ఇష్టం. క్రమం తప్పకుండా స్విమ్మింగ్, బాస్కెట్బాల్, టెన్నిస్ లో సాధన చేస్తోంది. కరాటేలో రకుల్ కు బ్లాక్ బెల్ట్ కూడా వుంది.
లౌక్యం, సరైనోడు , కరెంట్ తీగ, పండుగ చేస్కో , కిక్ -2 , నాన్నకు ప్రేమతో, రారండోయ్ వేడుక చూద్దాం, విన్నర్ , జయ జానకీ నాయకా, స్పైడర్, అయ్యారే , తదితర సినిమాల్లో నటించింది. రకుల్(Rakul Preeth Singh) నటిగా మంచి పాత్రలు రావాలని కోరుకుంటోంది. ఆమె మరిన్ని సినిమాల్లో నటించి అలరించాలని కోరుకుందాం. అయితే డ్రగ్ కేసులో ఆమె పేరు కూడా వినిపించింది. ఆ కేసు ప్రస్తుతం నడుస్తోంది.
No comment allowed please