Ram Gopal Varma : చంద్రబాబుపై ఆర్జీవీ సెటైర్
ఇది రక్త చరిత్ర కాదు దోమ చరిత్ర
Ram Gopal Varma : హైదరాబాద్ – వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిప్పులు చెరిగారు. ఆయన సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏపీ స్కిల్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు.
Ram Gopal Varma Comments on Chandrababu
ఆయనపై ఏపీ సీఐడీ తీవ్రమైన అభియోగాలు మోపింది. ఏసీబీ కోర్టు అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగించింది. దీంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తనకంటూ ఎదురే లేదని అనుకుంటూ వచ్చిన చంద్రబాబుకు జగన్ రూపంలో షాక్ తగిలింది. ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma).
ఆయన బాబుకు వ్యతిరేకంగా వ్యూహం సినిమా చేశారు. ప్రతిరోజూ సెటైర్లతో విరుచుకు పడుతున్నారు. బహిరంగంగానే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మద్దతు ప్రకటిస్తున్నారు. ఆయన తన పాలనను బాగానే చేస్తున్నారంటూ కితాబు ఇచ్చారు.
తాజాగా చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఉన్న గదిలో దోమలు దూరాయని, ఆయన ఇబ్బంది పడుతున్నారంటూ భార్య చేసిన ఆరోపణలను ఉద్దేశించి సెటైర్ వేశారు. ఇది రక్త చరిత్ర కాదని దోమ చరిత్ర అంటూ పేర్కొన్నారు.
Also Read : Akunuri Murali : హైకోర్టు తీర్పు చెంపపెట్టు