Ramiz Raja : ద్ర‌విడ్ ను విమ‌ర్శించ‌ని గ‌వాస్క‌ర్

షోయ‌బ్ అక్త‌ర్ పై ర‌మీజ్ ర‌జా

Ramiz Raja Gavaskar : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మ‌న్ ర‌మీజ్ ర‌జా (Ramiz Raja) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. మీరు ఎప్పుడైనా రాహుల్ ద్ర‌విడ్ ను సునీల్ మ‌నోహ‌ర్ గవాస్క‌ర్ విమ‌ర్శించ‌డం చూశారా అని ప్ర‌శ్నించాడు. ఆటగాళ్ల‌కు సంబంధించి ముందు వెనుకా చూసుకుని మాట్లాడాలంటూ హిత‌వు ప‌లికాడు. పాకిస్తాన్ మాజీ పేస‌ర్ షోయబ్ అక్త‌ర్ ఇటీవ‌ల విరాట్ కోహ్లీ లాంటి బ్రాండ్ బాబ‌ర్ ఆజ‌మ్ కాదంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

స్థానిక పాకిస్తాన్ ఛానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అక్త‌ర్ కేవ‌లం బాబ‌ర్ పై దాడి చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడ‌ని ఆరోపించాడు ర‌మీజ్ ర‌జా. ఆంగ్లంలో ఎలా మాట్లాడాలో తెలియ‌క మొత్తం పాకిస్తాన్ వైపు దాడి చేశాడ‌ని మండిప‌డ్డారు. ఈ వ్యాఖ్య‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల‌కు అంత‌గా న‌చ్చ‌ద‌న్నారు. బాబ‌ర్ ఆజ‌మ్ తో స‌హా పాకిస్తాన్ క్రికెట‌ర్ల‌లో పేల‌వ‌మైన క‌మ్యూనికేష‌న్స్ స్కిల్స్ ను ఎత్తి చూపాడు షోయ‌బ్ అక్త‌ర్.

మీరు మాట్లాడ లేక పోతే మీ అభిప్రాయాల‌ను స్వేచ్ఛ‌గా బ‌య‌ట‌కు చెప్పు కోలేర‌న్నారు. బాబ‌ర్ ఆజ‌మ్ పాకిస్తాన్ లో అతి పెద్ద బ్రాండ్ కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు. త‌ను చేసిన వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు ర‌మీజ్ ర‌జా(Ramiz Raja Gavaskar). ఏ దేశంలో కూడా స్వంత క్రికెట‌ర్ల‌ను కించ ప‌ర్చ‌ర‌ని కానీ షోయ‌బ్ ఇలా కామెంట్స్ చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నాడు. కాగా భార‌త దేశానికి వ‌స్తే సునీల్ గ‌వాస్క‌ర్ ఏనాడూ రాహుల్ ద్ర‌విడ్ గురించి ప‌ల్లెత్తు మాట అన‌లేద‌ని కితాబు ఇచ్చాడు.

Also Read : బీసీసీఐపై క‌మ్రాన్ అక్మ‌ల్ అక్క‌సు

Leave A Reply

Your Email Id will not be published!