#KasarlaShyam : గేయ రచయితగా రాణిస్తున్న కాసర్ల శ్యాం
తెలంగాణ పోరడు రాయడంలో గట్టోడు
Kasarla Shyam : ఎవరీ కాసర్ల అనుకుంటున్నారా. తెలంగాణకు చెందిన పోరడు. తెలంగాణ యాసలో అద్భుతమైన రీతిలో జనాన్ని మెస్మరైజ్ చేసేలా పాటలు రాయడంలో దిట్ట. ఎన్నో సినిమాలకు కూడా పాటలు రాశాడు. తెలంగాణకు చెందిన గేయాలు, పాటలు ఇప్పుడు సినిమాల్లోనే కాదు యూట్యూబ్ ను కూడా షేక్ చేస్తున్నాయి.
ఈ ప్రాంతానికి చెందిన వారు డైరెక్టర్లుగా, టెక్నీషియన్స్ గా, గేయ రచయితలుగా లెక్కలేనంత మంది వెలుగులోకి వచ్చారు. వారిలో హరీష్ శంకర్, దిల్ రాజు, విజయ్ దేవర కొండ, పైడిపల్లి వంశీ, నాగ్ అశ్విన్, చంద్ర బోస్, సుద్దాల అశోక్ తేజ, తరుణ్ భాస్కర్, గోరెటి వెంకన్న , తదితరులు దుమ్ము రేపుతున్నారు.
ఇంకా చెప్పుకుంటూ పోతే లెక్కలోకి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. త్రివిక్రం తీసిన అల వైకుంఠపురంలో కాసర్ల రాసిన రాములో రాములా అనే పాట మిలియన్ వ్యూస్ ను రాబట్టింది. ఈ పాట యూట్యూబ్ లో రికార్డు మోత మోగించింది. ఎస్.ఎస్.థమన్ స్వర పరిచారు. మంగ్లీ పాడారు. ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
పక్కా మాస్ సాంగ్. మాంచి ఊపు మీద తీసిన ఈ పాటలో బన్నీ డ్యాన్స్ అదర గొట్టింది. ఇక గేయ రచయిత కాసర్ల శ్యామ్ ది వరంగల్ జిల్లా హన్మకొండలోని బ్రాహ్మణవాడ. వృత్తి రీత్యా గీత రచయిత, గాయకుడు కూడా. తండ్రి రంగస్థల, టీవీ, సినీ నటుడు. దీంతో శ్యామ్‌కు(Kasarla Shyam ) బాల్యం నుంచే కళల పట్ల ఆసక్తి ఏర్పడింది.
ఆయన లాగే నటుడు కావాలని తెలుగు విశ్వ విద్యాలయంలో రంగస్థల విభాగంలో ఎంఫిల్ చేశాడు. చిన్నతనం నుండే శ్యాం సాహిత్యం పట్ల అభిలాషతో వరంగల్‌లో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వెళ్లే వాడు. అలా పాటలు పాడడం, రాయడంలో అనుభవాన్ని సంపాదించాడు. అనేక వేదికలపై జానపద నృత్యాలు చేయడంతో పాటు, పాటలూ పాడాడు.
వరంగల్ శంకర్, సారంగపాణిల బృందంతో కలసి పలు ప్రదర్శనలు ఇవ్వడంతో గాయకుడిగా, రచయితగా పేరు తెచ్చుకున్నాడు. సినిమాలకు రాక ముందు కాసర్ల శ్యాం వందలాది జానపద గీతాలు రాసి పాడాడు. వాటిని ఆల్బమ్స్‌గా కూడా తీసుకు వచ్చాడు. సుమారు 50 కి పైగా ఆల్బ్‌మ్స్‌కు ఆయన పాటలు రాశారు.
కాలేజీ పిల్ల చూడరో..యమ ఖతర్నాక్ గుందిరో అనే పాట శ్యాం రాసిన తొలిపాట. మస్తుగుంది పోరి, గల్ గల్ గజ్జెలు వంటి అనేక ప్రైవేటు ఆల్బమ్స్ ఆయన చేసినవే. 2003లో దర్శకురాలు జయ దర్శకత్వంలో వచ్చిన ‘చంటిగాడు’ సినిమాతో శ్యాంకు(Kasarla Shyam ) తొలి అవకాశం దక్కిది. ఆ చిత్రంలో ‘కోకోకో .. కొక్కొరోకో’ పాటతో సినీ గేయ రచయితగా పరిచయం అయ్యారు.
ఆ తర్వాత వరుసగా అనేక సినిమాలకు సందర్భాను సారంగా తాను రాసిన పాటలతో పరిశ్రమలో గేయ రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో శ్రీకాంత్ హీరోగా విడుదలైన ‘మహాత్మ’ సినిమాలో నీలపురి గాజుల ఓ నీలవేణి అంటూ రాసిన పాటకు మంచి గుర్తింపు వచ్చింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్ హీరోగా వచ్చిన పటాస్ లో రాసిన ఓ పాట కూడా విశేష గుర్తింపు తెచ్చింది. 2017లో వచ్చిన లై చిత్రంలో “బొమ్మోలే ఉన్నదిరా పోరి” అంటూ తనదైన జానపద బాణీని జోడించి రాసిన పాట వైవిధ్యతతో అందరినీ ఆకట్టుకుంటుంది, అలరించింది.
మాస్‌తోపాటు మెలోడీ, సందర్భోచిత గీతాలు రాయడంలో దిట్ట అని పేరు సంపాదించుకున్న శ్యాంను కొంతమంది దర్శకులు, సంగీత దర్శకులు రచయితల్లో విరాట్ కోహ్లీగా అభివర్ణిస్తుండడం విశేషం. కృష్ణవంశీతో మహాత్మ, నక్షత్రం సినిమాలకు పని చేసిన శ్యామ్, రాంగోపాల్ వర్మతో రౌడీ, అనుక్షణం అనే చిత్రాలు.
మారుతితో 12 చిత్రాలు, జక్కన్న, వెంకటేశ్ హీరోగా వచ్చిన బాబు బంగారం, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, కిక్-2, ప్రేమకథా చిత్రం, గల్ఫ్ తదితర చిత్రాల్లో రాసిన పాటలు కాసర్ల శ్యాం కు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఇప్పటి వరకు 100కు పైగా చిత్రాల్లో ఆయన 250 పాటలు రాసాడు. ఇప్పుడు రాములో రాములా సాంగ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది కాసర్ల (Kasarla Shyam )కెరీర్ లో. మరిన్ని పాటలు రాసి అలరించాలని ఆశిద్దాం.
No comment allowed please