Randeep Surjewala : సుప్రీంకోర్టు నిర్ణ‌యం బాధాక‌రం

కాంగ్రెస్ ప్ర‌తినిధి ర‌ణ్ దీప సూర్జేవాలా

Randeep Surjewala : రాజీవ్ గాంధీ హ‌త్య కేసులో ప్ర‌ధాన దోషిగా ఉన్న ఏజీ పెరారివాల‌న్ ను సుప్రీంకోర్టు బెయిల్ పై విడుద‌ల చేస్తూ తీర్పు చెప్పింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది.

భార‌త‌దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం తీసుకున్న ఈ నిర్ణ‌యంపై తీవ్ర విచారం వ్య‌క్తం చేసింది. దీనిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి ర‌ణ్ దీప్ సూర్జేవాలా. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

టెర్ర‌రిస్టును టెర్ర‌రిస్టుగానే చూడాలని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం చెప్పిన తీర్పు త‌మ‌ను ఎంత‌గానో బాధించాయ‌ని పేర్కొన్నారు. ఇవాళ త‌మిళ‌నాడులో ఏజీ పెరారివాల‌న్ విడుద‌ల‌య్యారు.

ఉరి శిక్ష అన్న‌ది స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కాద‌న్నారు. 30 ఏళ్లుగా త‌న త‌ల్లి త‌న విడుద‌ల కోసం పోరాటం చేసింద‌ని, ఆమె రుణం తాను తీర్చుకోలేన‌న్నారు పెరారివాల‌న్.

విచిత్రం ఏమిటంటే ఆయ‌న జైలులో 31 ఏళ్లు గ‌డిపారు. మొద‌ట రాజీవ్ గాంధీ హ‌త్య కేసులో కోర్టు మ‌ర‌ణ శిక్ష విధించింది.

రాష్ట్ర‌ప‌తికి క్ష‌మాభిక్ష ప్ర‌సాదించ‌మ‌ని వేడుకోవ‌డంతో మ‌ర‌ణ శిక్ష‌ను ర‌ద్దు చేసి జీవిత ఖైదుగా ప‌రిగ‌ణించింది. ఇదిలా ఉండ‌గా పెరారివాల‌న్ జైలులో ఉంటూనే కంప్యూట‌ర్ ఇంజ‌నీరింగ్ లో డిగ్రీ , మాస్ట‌ర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

ఆయ‌న పుస్త‌కాన్ని కూడా రాశారు. కాగా రాజీవ్ గాంధీ స‌తీమ‌ణి సోనియా గాంధీ, కొడుకు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంక గాంధీ ఇంకా స్పందించ లేదు.

ప్ర‌స్తుతం ర‌ణ్ దీప్ సూర్జేవాలా (Randeep Surjewala) చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. త‌మిళ‌నాడులో కాంగ్రెస్, డీఎంకే తో క‌లిసి ఉన్నాయి.

 

Also Read : ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ రాజీనామా

Leave A Reply

Your Email Id will not be published!