Rangamarthanda Trailer : రంగ‌మార్తాండ ట్రైల‌ర్ వైర‌ల్

ఆక‌ట్టుకుంటున్న డైలాగులు

Rangamarthanda Trailer : చాలా గ్యాప్ త‌ర్వాత క్రియేటివ్ డైరెక్ట‌ర్ గా పేరు పొందిన కృష్ణ వంశీ ద‌ర్శ‌క‌త్వం నుంచి వ‌స్తున్న సినిమా రంగ‌మార్తాండ‌. ఇది మ‌రాఠీలో అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించింది. తెలుగులో కృష్ణ‌వంశీ మ‌న‌సు పెట్టి తీశారు.

ప్ర‌ముఖ న‌టులు ప్ర‌కాశ్ రాజ్ , బ్ర‌హ్మానందం , ర‌మ్య కృష్ణ‌, శివాత్మిక రాజ‌శేక‌ర్ , రాహుల్ సిప్లిగంజ్ , త‌దిత‌ర న‌టీన‌టులు రంగ‌మార్తాండ‌లో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఒక ర‌కంగా జీవించారు. సినిమాకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌నే విడుద‌ల చేశారు చిత్ర బృందం. ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని మార్చి 22న రంగమార్తాండ‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇందుకు సంబంధించిన ట్రైల‌ర్(Rangamarthanda Trailer)  విడుద‌లైంది. ఆ వెంట‌నే సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ప్ర‌ధానంగా కృష్ణ‌వంశీ అంటేనే ఓ మార్క్. త‌న‌దైన ఆలోచ‌న‌ల‌కు ప్రాణం పోయ‌డం ఆయ‌న‌కు మాత్ర‌మే చెల్లుతుంది. రంగ‌మార్తాండ త‌న కెరీర్ లో బెస్ట్ సినిమాగా మారుతుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు డైరెక్ట‌ర్ కృష్ణ వంశీ. ఇక ట్రైల‌ర్ అంతా పూర్తిగా భావోద్వేగాల‌తో నింపేశాడు ద‌ర్శ‌కుడు. బ్ర‌హ్మానందం చెప్పే డైలాగ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది.

సినిమా అంత‌టా డైలాగుల‌తో నిండి పోయింది. ట్రైల‌ర్ చిత్రంపై మ‌రింత ఆస‌క్తిని పెంచేలా చేసింది. రంగ మార్తాండ‌ను కాలెపు మ‌ధు, వెంక‌ట్ నిర్మించారు. సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా దీనికి సంగీతం అందించారు. దివంగ‌త సినీ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి రంగ మార్తాండ‌కు పాట‌లు రాశారు. కానీ సినిమాను చూడ‌కుండానే వెళ్లి పోయారు. ఇక చాలా కాలం త‌ర్వాత కృష్ణ వంశీ నుంచి సినిమా వ‌స్తుండ‌డంతో పెద్ద ఎత్తున అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Also Read : క‌శ్య‌ప్ పై పాయ‌ల్ క‌న్నెర్ర‌

 

Leave A Reply

Your Email Id will not be published!