Ranil Wickremesinghe : శ్రీ‌లంక‌ అధ్య‌క్షుడిగా విక్ర‌మ సింఘే

బాధ్య‌తలు చేప‌ట్టిన తాజా మాజీ ప్ర‌ధాన మంత్రి

Ranil Wickremesinghe : శ్రీ‌లంక‌లో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించిన అనంత‌రం ప‌రిస్థితులు ఇంకా కంట్రోల్ లోకి రావ‌డం లేదు. ఈ త‌రుణంలో దేశ అధ్యక్షుడిగా ఉన్న గోట‌బ‌య రాజ‌ప‌క్సే త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇదే స‌మ‌యంలో ఆర్మీ స‌హ‌కారంతో మాల్దీవుల‌కు త‌న భార్య‌, అంగ‌ర‌క్ష‌కుల‌తో క‌లిసి ప‌రార‌య్యాడు. ప్ర‌ధాని కూడా రాజీనామా చేయాల‌ని, ఆయ‌న కూడా దేశం విడిచి వెళ్లాలంటూ నిర‌స‌న‌లు మిన్నంటాయి.

దేశంలో సంక్షోభం స‌మసి పోవాలంటే అనుభ‌వం క‌లిగిన, గ‌తంలో ప్ర‌ధాన‌మంత్రిగా, తాజాగా రాజీనామా ప్ర‌క‌టించిన ర‌ణిలే విక్రమ సింఘే అయితే బావుంటుంద‌ని పార్ల‌మెంట్ స్పీక‌ర్ భావించారు.

ఈ మేర‌కు శ్రీ‌లంక‌లో మామూలు ప‌రిస్థితులు నెల‌కొనేంత వ‌ర‌కు తాత్కాలిక అధ్య‌క్షుడిగా ర‌ణిలె విక్ర‌మ సింఘేను నియ‌మించారు. ప్ర‌స్తుతం చీఫ్ గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

తీవ్ర‌మైన వ్య‌తిరేక‌, నిర‌స‌న‌ల మ‌ధ్య ర‌ణిలే బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం చ‌ర్చ‌కు దారితీసింది. ఈ విష‌యాన్ని రాయిట‌ర్స్ సంస్థ వెల్ల‌డించింది.

ప్ర‌ధాన మంత్రి తాత్కాలిక అధ్య‌క్షుడిగా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని దేశ వ్యాప్తంగా ప్ర‌క‌టించారు. ప‌శ్చిమ ప్రావిన్స్ లో క‌ర్ఫ్యూ విధించారంటూ

విక్ర‌మ సింఘే (Ranil Wickremesinghe) మీడియా కార్య‌ద‌ర్శి డినౌల్ కొలంబేజ్ చెప్పారు.

క‌ర్ఫ్యూ వెంట‌నే అమ‌లు లోకి వ‌స్తుంద‌న్నారు మ‌రో వైపు సింఘే రాజీనామా చేయాలంటూ ఆందోళ‌న‌లు మిన్నంటాయి. భ‌ద్ర‌తా బ‌ల‌గాల బాష్ఫ వాయువు షెల్స ను ధీటుగా ఎదుర్కొంటూ వ‌చ్చారు.

భ‌ద్ర‌తా ద‌ళాలు దాడుల‌కు తెగ‌బ‌డినా ఆందోళ‌న‌కారులు బెద‌ర‌డం లేదు. ఆగ్ర‌హంతో వారంతా లంక ప్ర‌ధాని నివాసంపైకి దూసుకెళ్లారు.

Also Read : శ్రీ‌లంక‌లో ఎమ‌ర్జెన్సీ డిక్లేర్

Leave A Reply

Your Email Id will not be published!