Ratan Tata : ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు అస్సాం ముఖ్యమంత్రి హింత బిస్వా శర్మ రాష్ట్ర అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. ఇప్పటికే రతన్ టాటా(Ratan Tata) దేశం కోసం చేసిన సేవలకు గుర్తుగా అసోం వైభవ్ అవార్డుకు ప్రభుత్వం ఎంపిక చేసింది.
వ్యక్తిగత కారణాల రీత్యా జనవరి 24న గౌహతిలో జరిగిన కార్యక్రమానికి రతన్ టాటా హాజరు కాలేక పోయారు. ఇవాళ రతన్ టాటాను (Ratan Tata)స్వయంగా కలిసి అవార్డును అందజేశారు. సామాజిక కార్యక్రమాలకు తన జీవిత కాలాన్ని వినియోగించారు.
అంతే కాదు నర నరాన భారతీయతను కలిగి ఉన్నారు రతన్ టాటా. టాటా సంస్థల్లో పని చేసే ప్రతి ఒక్కరికీ ఉద్యోగ, పదవీ విరమణ తర్వాత కూడా పెన్షన్ సౌకర్యాన్ని కల్పించారు.
తాజాగా భారత ప్రభుత్వానికి చెందిన, నష్టాల్లో కూరుకు పోయిన ఎయిర్ ఇండియాను కొనుగోలు చేశారు. దానికి కొత్త సిఇఓను ఎంపిక చేశారు. ఆ సంస్థలో పని చేసే వారికి పీఎఫ్ వర్తింప చేసేలా చర్యలు తీసుకున్నారు.
ఆయనకు లెక్కించ లేనంత ఆస్తులు, కోట్లు ఉన్నా చాలా సాధారణంగా జీవితాన్ని గడుపుతారు. ఇటీవల తాను కలలు కన్న సామాన్యుడి నానో ఎలక్ట్రిక్ కారులో ప్రయాణం చేసి విస్తు పోయేలా చేశారు.
ఇదిలా ఉండగా అనారోగ్య కారణం వల్ల రతన్ టాటా అస్సాంకు వెళ్ల లేక పోయారు. ఈ మేరకు సీఎంకు రాసిన లేఖలో తనను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అస్సామీ ప్రజల శ్రేయస్సు కోసం సీఎం చేస్తున్న కృషిని అభినందించారు.
Also Read : ఎయిర్ ఇండియా సిఇఓగా ‘ఐకెర్’