Post Office Schemes : సీనియర్ సిటిజన్లకు ఖుష్ కబర్
వడ్డీ రేటు పెంచిన పోస్టాఫీస్
Post Office Schemes : తక్కువ మొత్తంలో ఎక్కువగా డబ్బులు రావాలంటే ఉన్నది ఒక్కటే మార్గం పోస్టాఫీస్. ప్రస్తుతం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ఇక ఐటీలో కొలువులు ఊడుతున్నాయి. ఇక బ్యాంకుల పరిస్థితి కూడా దారుణంగా తయారైంది.
ఈ తరుణంలో కేవలం దేశ వ్యాప్తంగా విస్తరించిన పోస్టాఫీసులలో డబ్బులను(Post Office Schemes) దాచుకోవడమే మేలనే స్థితికి వచ్చారు జనం. మరో వైపు పార్లమెంట్ లో సీనియర్ సిటిజన్లకు సొమ్మును దాచుకునేందుకు వీలు కల్పించేలా నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.
ఈ మేరకు పోస్టాఫీస్ కుష్ కబర్ చెప్పింది సీనియర్ సిటిజన్లకు . అన్ని పథకాలపై 7 శాతానికి తగ్గకుండా వడ్డీ రేట్లను సవరించింది. అంతే కాకుండా సీనియర్లకు 8 శాతం ఇస్తోంది. వీరి కోసం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ను ఏర్పాటు చేసింది. ఇది ఎక్కువ వడ్డీని అందజేస్తుంది. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మందికి ఎంతో మేలు చేకూరనుంది.
పోస్టాఫీస్ నెల వారీ ఆదాయ పథకం. ఇందులో ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు 6.7 నుంచి 7.1 శాతానికి పెంచింది. ఇందులో రూ. 1,000 నుంచి రూ. 9 లక్షల దాకా జమ చేయొచ్చు. ప్రతి నెలా వడ్డీని చెల్లిస్తారు. మరో పథకం టైమ్ డిపాజిట్ ఖాతా.
ఇందులో టర్మ్ పూర్తయ్యాక చెల్లిస్తారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కు సంబంధించి వడ్డీ రేటు 6.8 నుంచి 7 శాతానికి పెంచింది. వీటితో పాటు కిసాన్ వికాస్ పత్ర లో 7 శాతం వడ్డీ రేటు ఉండగా సుకన్య సమృద్ది యోజన 7.6 శాతం , పీపీఎఫ్ 7.1 శాతం పెరిగింది.
Also Read : అధునాతన కూరగాయల మార్కెట్లు