Rats: ఐసీయూలో ఇద్దరు శిశువులను కరిచిన ఎలుకలు
ఐసీయూలో ఇద్దరు శిశువులను కరిచిన ఎలుకలు
Rats : ప్రభుత్వ ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో ఉన్న ఇద్దరు శిశువులను ఎలుకలు (Rats) కరిచిన ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని ఇండోర్ లో చోటుచేసుకుంది. దీనిపై స్పందించిన ఆసుపత్రి అధికారులు… సమగ్ర దర్యాప్తును ప్రారంభించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే…
Rats Attack on Infants
వారం కిందట జన్మించిన ఆ ఇద్దరు శిశువులను, రాష్ట్రంలోని అతిపెద్ద ఆస్పత్రుల్లో ఒకటైన మహారాజ యశ్వంతరావు చికిత్సాలయ(ఎమ్‌వైహెచ్)లోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఎన్ఐసీయూ)లో చేర్చారు. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న ఆ శిశువుల శరీరాలపై గాయాలను గుర్తించిన నర్సుల బృందం డాక్టర్లకు సమాచారం అందించారు. దీంతో ఐసీయూలో ఉన్న సీసీటీవీని పరిశీలిస్తే… ఆ పసిపిల్లల వద్దకు ఎలుకలు వచ్చిన దృశ్యాలు కనిపించాయి. దీంతో అవే శిశువులను గాయపరిచినట్లు అనుమానిస్తున్నారు. మొదటగా ఈ ఘటన ఆదివారం జరగ్గా… మరసటి రోజే మరో ఘటన జరగడం గమనార్హం. దీంతో అక్కడి వైద్య నిర్వహకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తోందని శిశువుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆస్పత్రి కిటికీలకు బలమైన ఐరన్ నెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ యాదవ్ మంగళవారం తెలిపారు. అంతేకాకుండా రోగులకు సహాయంగా ఉన్న వారు ఆహార పదార్థాలను వార్డులకు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనలపై దర్యాప్తు చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు డాక్టర్ అశోక్ యాదవ్ వెల్లడించారు.
Also Read : Rahul Gandhi: బైక్ కోల్పోయిన వ్యక్తి కొత్త బైక్ ను ఇచ్చిన రాహుల్ గాంధీ
