Ravi Bishnoi : త‌డ‌బ‌డినా దుమ్ము రేపాడు

ఆక‌ట్టుకున్న ర‌వి బిష్ణోయ్

Ravi Bishnoi : భార‌త జ‌ట్టులో ప్రాతినిధ్యం వ‌హించిన ర‌వి బిష్ణోయ్ త‌డ‌బడినా దుమ్ము రేపాడు. త‌న అద్భుత‌మైన బౌలంగ్ తో విండీస్ ఆట‌గాళ్ల‌కు చుక్క‌లు చూపించాడు. ప్ర‌ధానంగా ర‌వి గూగ్లీల‌తో ఆక‌ట్టుకున్నాడు.

ఒకానొక ద‌శ‌లో ఆడేందుకు చాలా ఇబ్బంది ప‌డ్డారు స్టార్ ప్లేయ‌ర్లు. ఓవ‌ర్ల‌లో కొన్ని వైడ్ బాల్స్ వేసినా ఆ త‌ర్వాత త‌న‌ను తాను మార్చుకున్నాడు.

ఇందుకు మెచ్చు కోవాల్సింది కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌. 4 ఓవ‌ర్లు మాత్ర‌మే వేసిన ర‌వి బిష్ణోయ్ 17 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. కానీ రెండు ప్ర‌ధాన వికెట్లు తీశాడు. ఇందులో 17 డాట్ బాల్స్ ఉండ‌డం విశేషం.

ఆరు బంతులు వైడ్ బాల్స్ వెళ్లాయి. ఓ బంతి వైడ్ బాల్ కాదంటూ సీరియ‌స్ అయ్యాడు రోహిత్ శ‌ర్మ‌. కోహ్లీ జోక్యం చేసుకోవ‌డంతో నెమ్మ‌దించాడు.

దీంతో విండీస్ తో జ‌రిగిన టీ20 మ్యాచ్ లో అత్యంత కీల‌క భూమిక పోషించాడు. భార‌త విజ‌యంలో ప్ర‌ధానంగా మార‌డంతో ర‌వి బిష్ణోయ్ (Ravi Bishnoi)ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక‌య్యాడు. త‌న కెరీర్ లోనే ఫ‌స్ట్ మ్యాచ్ లోనే రికార్డు బ్రేక్ చేయ‌డం విశేషం.

మొద‌టి మ్యాచ్ లోనే అవార్డు అందుకున్న ఎనిమిదో ప్లేయ‌ర్ గా నిలిచాడు ర‌వి బిష్ణోయ్. అత‌డి కంటే ముందు దినేష్ కార్తీ, బ్ర‌దీనాథ్, ఓజా, ప‌టేల్ , బ‌రీంద‌ర్ , సైనీ, హ‌ర్ష‌ల్ రికార్డు సృష్టించారు.

ఇదిలా ఉండ‌గా మ్యాచ్ పూర్త‌యిన త‌ర్వాత ర‌వి విష్ణోయ్ మాట్లాడాడు. జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు నేను జాతీయ జ‌ట్టుకు ఆడ‌తాన‌ని అన్నాడు. సంతోషంగా, అంత‌కు మించి ఆనందంగా ఉంద‌న్నాడు ర‌వి.

Also Read : శ్రేయ‌స్ అయ్య‌ర్ కు అరుదైన ఛాన్స్

Leave A Reply

Your Email Id will not be published!