RBI Hike : భారీగా వ‌డ్డీ రేట్లు పెంచిన ఆర్బీఐ

రుణ గ్ర‌హీతల‌కు కోలుకోలేని షాక్

RBI Hike : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోలుకోలేని షాక్ ఇచ్చింది. అంతా అనుకున్న‌ట్టుగానే వ‌డ్డీ రేట్ల‌ను పెంచింది. రుణాలు మ‌రింత భారం కానున్నాయి. బుధ‌వారం ఆర్బీఐ(RBI Hike) కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. వ‌డ్డీ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది.

ఈ ఏడాది ల‌క్ష్యానికి మించి ద్ర‌వ్యోల్బ‌న అంచ‌నాను కూడా పెంచింది. దాంతో రెపో రేటు 4.9 శాతానికి తీసుకు వెళ్లింది. దాని ల‌క్ష్య శ్రేణి ఎగువ ముగింపు కంటే ఎక్కువ‌గా ఉంది.

ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ నేతృత్వంలోని ద్ర‌వ్య విధాన క‌మిటీ (ఎంపీసీ) లోని ఆరుగురు స‌భ్యులు ఏక‌గ్రీవంగా తాజా రేట్ల పెంపున‌కు ఓటు వేశారు.

విస్తృత మార్కెట్ అంచ‌నాలు ఇలాగే ఉంటే గ‌నుక ఆర్బీఐ త‌న ఆగ‌స్టు స‌మావేశంలో మ‌ళ్లీ రేట్ల‌ను పెంచుతుంద‌ని భావిస్తున్నారు మార్కెట్ రంగ నిపుణులు. ఏప్రిల్ లో 8 సంవ‌త్స‌రాల గ‌రిష్ట స్థాయి 7.79 శాతానికి చేర‌కుంది.

వ‌రుస‌గా ఏడో నెల‌లో దూసుకు పోయింది. కాగా ఏడాది ప్రారంభం నుంచి రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం ఆర్బీఐ 2-6 శాతం టార్గెట్ కంటే ఎక్కువ‌గా ఉంది.

సెంట్ర‌ల్ బ్యాంక్ ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి ద్ర‌వ్యోల్బ‌ణం అంచ‌నాను ఏప్రిల్ లో అంచ‌నా వేసిన 5.7 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది.

ఇటీవ‌లి కాలంలో ట‌మాటా పెర‌గ‌డం, ముడి చ‌మురు ధ‌ర‌లు ద్ర‌వ్యోల్బ‌ణానికి ఆజ్యం పోస్తున్నాయ‌ని ఆర్బీఐ(RBI Hike) గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ అన్నారు.

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం తొలి మూడు నెల‌ల్లో ద్ర‌వ్యోల్బ‌ణం 6 శాతం కంటే ఎక్కువ‌గానే ఉండ‌వ‌చ్చ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు గ‌వ‌ర్న‌ర్. గ‌తంలో అంచ‌నా వేసిన‌ట్లే 7.2 శాతానికి విస్త‌రిస్తుంద‌ని అంచ‌నా వేసింది ఆర్బీఐ.

Also Read : డాటా ఇస్తేనే డీల్ లేదంటే ర‌ద్దు

Leave A Reply

Your Email Id will not be published!