RCB vs DC WPL 2023 : ఆర్సీబీ పరాజయాల పరంపర
పని చేయని మంధాన మంత్రం
RCB vs DC WPL 2023 : ప్రపంచ క్రికెట్ చరిత్రలో మొదటిసారిగా నిర్వహిస్తున్న మహిళల ప్రిమీయర్ లీగ్ పోటీల్లో భారీ ధరకు అమ్ముడు పోయింది ముంబై స్టార్ క్రికెటర్ స్మృతీ మంధాన. ఏకంగా రూ. 3.40 కోట్లకు చేజిక్కించుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం. తక్కువ ధరకు అమ్ముడు పోయిన క్రికెటర్లు దుమ్ము రేపారు.
మంధానకు కెప్టెన్సీ కూడా దక్కింది. ఆట పరంగా రాణించక పోగా నాయకత్వ పరంగా పూర్తిగా వైఫల్యం చెందింది. రిచ్ లీగ్ లో ఇప్పటి వరకు కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ టాప్ లో నిలిచింది. ఇక ఆర్సీబీ వరుసగా 5వ సారి ఓటమి మూటగట్టుకుంది.
తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఓడి పోయింది ఆర్సీబీ(RCB vs DC WPL 2023). ఎన్ని మార్పులు చేసినా విజయం దక్కక పోవడంతో ఆర్సీబీ మేనేజ్ మెంట్ పునరాలోచనలో పడింది. డీవై పాటిల్ వేదికగా జరిగిన కీలక పోరులో చేతులెత్తేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 151 రన్స్ చేసింది. 15 బంతులు ఎదుర్కొన్న కెప్టెన్ మంధాన కేవలం 8 రన్స్ చేసింది. ఆలిస్ ప్యారీ 52 బంతులు ఎదుర్కొని 67 రన్స్ చేసింది.
రిచా ఘోష్ 37 రన్స్ చేసింది. కేవలం 16 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 3 సిక్సర్లు కొట్టింది. అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా 2 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ పూర్తి చేసింది. 19.4 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేధించింది. జెమీమా 32 రన్స్ చేస్తే మరిజన్ కాప్ 32 తో రాణించింది. జోన్సన్ 29 , ఎల్లిస్ కాప్సే 38 రన్స్ చేయడంతో ఘన విజయాన్ని నమోదు చేసింది.
Also Read : నాలుగో టెస్టు డ్రా..భారత్ దే సీరీస్