RCB vs PBKS IPL 2023 : ఆర్సీబీ చేతిలో పంజాబ్ చిత్తు
24 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ
RCB vs PBKS IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్ పై 24 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. పంజాబ్ స్కిప్పర్ శిఖర్ ధావన్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ దుమ్ము రేపారు. దంచి కొట్టారు . పంజాబ్ కింగ్స్ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించారు.
ఇద్దరు ఓపెనర్లు 16 ఓవర్ల వరకు ఆడారు. విరాట్ కోహ్లీ 59 రన్స్ చేస్తే ఫాఫ్ డు ప్లెసిస్ ఏకంగా 84 పరుగలుఉ చేశాడు. ఈ ఇద్దరు తప్ప మిగతా బ్యాటర్లు ఎవరూ ఆశించినంత మేర రాణించ లేక పోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
అనంతరం 175 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్(RCB vs PBKS IPL 2023) కేవలం 154 పరుగులకే పరిమితమైంది. ప్రత్యర్థి జట్టును నడ్డి విరిచాడు హైదరాబాద్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్. ఏకంగా నాలుగు ఓవర్లు వేసి 21 రన్స్ మాత్రమే ఇచ్చి కీలకమైన 4 వికెట్లు తీశాడు. ఇక పంజాబ్ జట్టులో ప్రభాసిమన్ సింగ్ 46 పరుగులు చేస్తే , జితేశ్ శర్మ 41 పరుగులు మాత్రమే చేసి రాణించారు. మిగతా ఆటగాళ్లు పూర్తిగా చేతులెత్తేశారు.
Also Read : కేఎల్ రాహుల్ కు జరిమానా