Realestate Broker : పంజాబ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కుటుంబం అనుమానాస్పద మృతి

పంజాబ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కుటుంబం అనుమానాస్పద మృతి

Realestate Broker : పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. పాటియాలా జిల్లాలోని ఒక గ్రామానికి సమీపంలోని పంటపొలాల్లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. దీనిని గుర్తించిన స్థానిక రైలులు… పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది సామూహిక ఆత్మహత్యగా కనిపిస్తున్నప్పటికీ, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారి మంజిత్ సింగ్ మీడియాకు తెలిపారు.

Realestate Broker Dead

టెప్లా బానూర్‌ (Banur) లోని జాతీయ రహదారిలోని ఒక నిర్జన ప్రదేశంలో నిలిపివుంచిన ఈ కారును పోలీసులు గుర్తించారు. మొహాలీకి చెందిన స్థిరాస్థి వ్యాపారి సందీప్ సింగ్ రాజ్‌పాల్ (45), అతని భార్య మందీప్ కౌర్ (42), వారి కుమారుడు అభయ్ సింగ్ (15)ల మృతదేహాలు ఆ కారులో ఉన్నాయని పోలీసులు తెలిపారు. వారి శరీరాలపై తుపాకీ కాల్పుల గాయాలు ఉన్నాయని, క్యాబిన్ లోపల రక్తం చిమ్మివుందని పోలీసులు పేర్కొన్నారు. స్థిరాస్థి వ్యాపారి మృతదేహం డ్రైవర్ సీటులో ఉందని, అతని భార్య మృతదేహం ముందు సీటులో, వెనుక సీటులో వారి కుమారుని మృతదేహం పోలీసులకు కనిపించాయి.

కొందరు కూలీలు ఈ కారును గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. కారులో నుంచి ఒక హ్యాండ్‌ గన్‌ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారాన్ని పోలీసులు మృతుల బంధువులకు తెలియజేశారు. ప్రాథమిక దర్యాప్తులో సందీప్ సింగ్ తన భార్యను, కుమారులను షూట్‌ చేశాక, తాను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని తేలింది. వారి కుమారుడు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని పోలీసులు గుర్తించారు. బతిండాలోని సిఖ్వాలా గ్రామానికి చెందిన సందీప్ సింగ్ గత ఎనిమిది ఏళ్లుగా మొహాలిలో నివసిస్తున్నాడు.

Also Read : Minister Hardeep Singh: హర్మూజ్‌ జలసంధి మూసివేతపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!