Uddhav Thackeray : గ‌వ‌ర్న‌ర్ కోష్యారీని రీకాల్ చేయండి – ఠాక్రే

కేంద్రం అమెజాన్ ద్వారా పంపించింది

Uddhav Thackeray : శివ‌సేన పార్టీ చీఫ్‌, మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే(Uddhav Thackeray) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోష్యారీపై నిప్పులు చెరిగారు. మ‌రాఠా చ‌రిత్ర తెలుసు కోకుండా అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం అల‌వాటుగా మారింద‌న్నారు. మ‌హారాష్ట్ర‌లో ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హ‌రాజ్ ను దేవుడిగా , యోధుడిగా కొలుస్తారు.

అయితే శివాజీపై గ‌వ‌ర్న‌ర్ ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న గ‌తించిన నాయ‌కుడంటూ పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కోష్యారీని తొల‌గించాలంటూ ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. శివ‌సేన తిరుగుబాటు వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే సంజ‌య్ గైక్వాడ్ ఏకంగా ఈ గ‌వ‌ర్న‌ర్ ను వెంట‌నే మార్చాల‌ని,

త‌మ‌కు వ‌ద్దంటూ కోరారు. ప్ర‌స్తుతం శివ‌సేన తిరుగుబాటు వ‌ర్గం, బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ లో భాగంగా ఉంది. కోష్యారీ వ్య‌వ‌హారం బీజేపీకి, కేంద్ర స‌ర్కార్ కు త‌ల‌నొప్పిగా మారింది. ఈ త‌రుణంలో ఉద్ద‌వ్ ఠాక్రే(Uddhav Thackeray) షాకింగ్ కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. కేంద్రం అమెజాన్ ద్వారా కోష్యారీని పార్సిల్ రూపంలో గ‌వ‌ర్న‌ర్ గా మహారాష్ట్ర‌కు పంపించిందంటూ ఎద్దేవా చేశారు.

గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోష్యారీని రీకాల్ చేయాల‌ని, లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని ఉద్ద‌వ్ ఠాక్రే హెచ్చ‌రించారు. మ‌రో వైపు శివ‌సేన జాతీయ అధికార ప్ర‌తినిధి, రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్ సైతం నిప్పులు చెరిగారు.

ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ చ‌రిత్ర తెలియ‌ని వాళ్ల‌ను ఉన్న‌త ప‌ద‌వుల్లో కేంద్రం ఎలా నియ‌మిస్తోందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌రో వైపు రోజు రోజుకు కోష్యారీ వివాదం ముదురుతోంది.

Also Read : గాల్వాన్ ట్వీట్ త‌ప్పైంది..మ‌న్నించండి

Leave A Reply

Your Email Id will not be published!