Allola Divya Reddy : ఆవులను జాతీయ సంపదగా గుర్తించాలని కోరారు క్లిమామ్ ఫౌండర్ అల్లోల దివ్యా రెడ్డి(Allola Divya Reddy). ఆమె భారత సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రమణ దంపతులకు క్లిమామ్ సంస్థ ఆధ్వర్యంలో గోశాల ఉత్పత్తులను అందించారు. ఆమె కొంత కాలం నుంచి దేశీయ జాతి ఆవులను సంరక్షించే పనిలో పడ్డారు.
ఇందులో భాగంగానే క్లిమోమ్ వెల్ నెస్ అండ్ ఫార్మ్స్ ను 2015లో ప్రారంభించినట్లు జస్టిస్ రమణకు వివరించారు. తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు, చిన్న పిల్లలకు స్వచ్ఛమైన ఏ2 పాలను అందించాలనే సదుద్దేశంతో గోశాలను ఆరంభించినట్లు చెప్పారు.
జన్యు సంపద, స్థానిక పరిస్థితులను తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి ఈ దేశీ ఆవులకు ఉంటుందని తెలిపారు. తక్కువ ఖర్చుతో పోషించ గలిగే దేశీయ జాతి ఆవులు సేంద్రీయ వ్యవసాయానికి వెన్నుముక లాంటివని వివరించారు సీజేఐ రమణకు.
గతంలో దేశ సంపదలో జాతి ఆవులు కీలక పాత్ర పోషించాయని తెలిపారు. స్థానిక పరిస్థితులను తట్టుకుంటూ ఉంటాయని అందుకే వాటిని సంరక్షించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వీటిని భవిష్యత్ తరాలకు అందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని దివ్యా రెడ్డి (Allola Divya Reddy)వెల్లడించారు. ప్రస్తుతం దేశీ జాతి ఆవుల ఉనికికి ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆవును జాతీయ సంపదగా గుర్తించేలా తమరు ప్రయత్నం చేయాలని విన్నవించారు. ఈ సందర్భంగా తనను కలిసిన అల్లోల దివ్యా రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు జస్టిస్ రమణ దంపతులు.
Also Read : సాగు విస్తీర్ణం పెరిగేందుకు కృషి చేయాలి