TS JOBS : రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఖాళీగా 529 పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తోంది.
జిల్లా పరిషత్ లలో ఖాళీగా ఉన్న 467 పోస్టులు ఉండగా జిల్లా పంచాయతీ శాఖలో(TS JOBS) 62 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాల్లో వారీగా ఉద్యోగుల విభజన క్లియర్ చేసింది.
మొత్తం జిల్లాల్లో సిద్దిపేటకు 34 పోస్టులు అత్యధికంగా ఉన్నాయి. ఈ జిల్లాల్లో ఖమ్మం జిల్లాల్లో ఎలాంటి ఖాళీలు లేక పోవడం విశేషం. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది.
వివిధ జిల్లాలను విభజిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పరిషత్తు , జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాల్లో వివిధ పోస్టులకు అనుమతి ఇచ్చింది.
ఇందులో జెడ్పీలో సూపరింటెండెంట్ పోస్టులు 103 పోస్టులు, సీనియర్ అసిస్టెంట్ జాబ్స్ 151, జూనియర్ అసిస్టెంట్ 213 పోస్టులు ఉన్నాయి.
వీటితో పాటు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్ పోస్ట్స్ 22, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 40 ఖాళీగా ఉన్నాయి.
వీటిలో కొన్ని పోస్టులను నేరుగా భర్తీ చేయనున్నారు. మరికొన్ని పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. ఆయా జిల్లాలలకు సంబంధించి సిద్దిపేట జిల్లాకు 34 పోస్టులు కాగా సంగారెడ్డి, నిర్మల్ , నాగర్ కర్నూల్ , మెదక్ జిల్లాలకు 27 పోస్టుల చొప్పున మంజూరయ్యాయి.
ఇదిలా ఉండగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసినా ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయక పోవడాన్ని తప్పు పడుతున్నారు నిరుద్యోగులు.
Also Read : త్రిపుర మాజీ సీఎంకు రాజ్యసభ సీటు