#NewIdea : కాసులు కురిపిస్తున్న ఐడియా

అద్దెకు ఆఫీసులు..భ‌వ‌నాలు

New Idea  : దునియాలో ఒకప్పుడు బతకాలంటే సవాలక్ష ఇబ్బందులు. ఇప్పుడు అలాంటి కస్టాలు ఏమీ లేవు. ఎందుకంటే టెక్నాలజీ మారింది. ప్రపంచం చిన్నదై పోయింది. లెక్కలేనన్ని అవకాశాలు తలుపు తడుతున్నాయి. రా రమ్మంటూ ఊరిస్తున్నాయి. కావాల్సిందల్లా ఓపికతో వేచి చూడటమే మిగిలి ఉన్నది. సాంకేతిక రంగంలో చోటు చేసుకున్న పెను మార్పుల దెబ్బకు అన్ని రంగాలు అతలాకుతలమై పోయాయి.

వేలాది మందికి కొలువులు దక్కుతున్నా, ఆశించినంతగా అందడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో వేలాదిగా స్టార్ట్ అప్ సంస్థలు పుట్టుకు వచ్చాయి. ప్రారంభంలో చిన్న గదుల్లో స్టార్ట్ అయి..నేడు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.

అయితే కాంపిటీషన్ విపరీతంగా పెరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా చూస్తే రోజు రోజుకు చేంజెస్ చోటు చేసుకుంటున్నాయి. ఐటి, ఈ కామర్స్, డిజిటల్ టెక్నాలజీ, సోషల్ మీడియా , టెలికం, ఆయిల్ , జ్యూయలరీ , ట్రాన్స్ పోర్ట్ తదితర రంగాలలో పని చేస్తున్న వారు అభద్రతకు లోనవుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాలలో కంపెనీల ఏర్పాటు అన్నది భారీ ఖర్చుతో కూడుకున్నది.

కోట్లాది రూపాయలతో పాటు ఒక్కోసారి కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో పెట్టుబడి ఎక్కువ కావడం, ఉద్యోగాల కల్పన , తదితర అంశాలన్నీ పెను భారంగా మారనుంది. దీంతో కొత్తగా ఆలోచించే వాళ్లకు విపరీతమైన డిమాండు ఉంటోంది. తాజాగా కంపెనీలు ఎదుర్కుంటున్న ఈ ప్రధాన సమస్యకు పరిష్కారం చూపించే ఐడియాస్ కు పెద్ద పీట దక్కుతోంది. అదే ఐడియా స్పేస్ ఫర్ రెంట్ కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది.

ఇది ఇప్పటికే బెంగళూర్ , ఢిల్లీ , ముంబై, చెన్నై , తదితర నగరాలలో ఈ పద్ధతి ఇప్పటికే ఉన్నది. తాజాగా హైదరాబాద్ లో భవనాలు , ఆఫీస్ లలో రెంట్ పంచుకునేందుకు ఉత్సుకత చూపిస్తున్నాయి. మొత్తం మీద కొత్త ఐడియా బాగా వర్కవుట్ అవుతోంది. దీని వల్ల డబ్బులు ఆదా అవుతాయి. కాసులు కురిపించేలా చేస్తోంది.

No comment allowed please