Boris Johnson : పీఎం పదవి వదులు కోవడం బాధాకరం
గత్యంతరం లేక తప్పుకున్న ప్రధాన మంత్రి
Boris Johnson : ఇది ఊహించని పరిణామం. నేను కూడా అనుకోలేదు. సాధ్యమైనంత వరకు దేశం కోసం పని చేశాను. ప్రధానమంత్రిగా నా బాధ్యతలను సక్రమంగానే నిర్వర్తించాను.
ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ప్రపంచంలో యూకే తనదైన ముద్ర ఉండేలా పాటుపడ్డాను. ఈ సమయంలో అత్యున్నతమైన ఈ పదవి నుంచి తప్పుకోవడం నాకు ఒకింత బాధగానే ఉంది.
కానీ తప్పదు. అందరినీ అన్ని కాలాల్లో సంతృప్తి పర్చడం ఏ నాయకుడు చేయలేడన్నాడు ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన బోరీస్ జాన్సన్. బయటకు కనిపించినంత అందంగా, మరింత సులువుగా ప్రభుత్వాన్ని నడపడం అసాధ్యమన్నారు.
ఇందులో భాగంగా బోరీస్ జాన్సన్(Boris Johnson) సంచలన కామెంట్స్ చేశారు. ఒక రకంగా తన రాజకీయ జీవితంలో నేర్చుకున్న వాటిని ఉదహరించడం విశేషం. గురువారం కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి పదవికి రాజీనామా సమర్పించారు.
దీంతో సుదీర్ఘ కాలంగా పదవి చేపట్టిన బోరీస్ జాన్సన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదన్నారు. నేను సక్సెస్ కాలేక పోయినందుకు చింతిస్తున్నానని చెప్పారు బోరిస్ జాన్సన్.
టాప్ పోస్ట్ ను వదులు కోవడం బాధ కలిగిస్తోందన్నారు. పార్టీకి కొత్త నాయకుడు సమర్థవంతంగా ఉండాలని సూచించారు. ఉక్రెయిన్ కు మద్దతు ఇస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా యూకే క్యాబినెట్ లో మూడో శాతం మంత్రులు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ప్రధానంగా పీఎం బోరీస్ జాన్సన్ అనుసరిస్తున్న వైఖరిని తప్పు పట్టారు.
తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో తాము పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read : రాజీనామాకు బోరీస్ జాన్సన్ ఓకే